Punjab Elections : అంకెల్లో ఒకటి అక్షరాల్లో మరొకటి..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కచ్చితంగా ఎంత నమోదయిందన్నది ఇంకా చెప్పలేదు.
- By Hashtag U Published Date - 10:52 AM, Tue - 22 February 22
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కచ్చితంగా ఎంత నమోదయిందన్నది ఇంకా చెప్పలేదు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకే ఎన్నికలు ముగిసినా పోలింగ్ శాతం లెక్కింపు కొలిక్కి రాలేదు.71.95 శాతం మేర పోలింగ్ శాతం నమోదయిందని తొలి అంచనాల ప్రకారం అధికారులు ప్రకటించారు. సహజంగానే ఈ నెంబరు పెరుగుతుంది. అన్ని పోలింగ్ బూత్‌ల సమాచారం వచ్చినప్పుడే కచ్చితమైన లెక్క తేలుతుంది. మరి ఇన్నిరోజులు గడిచినా ఇంకా ఎందుకు పోలింగ్ శాతాన్ని ప్రకటించలేదు? దీని వెనుక బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏమిటి?
పోలింగ్ బూత్‌ల వారి సమాచారం సేకరణకు అక్కడి సిబ్బంది చాలా ఫారాలు నింపాల్సి ఉంటుంది. వారికి పైన ఉండే అధికారులు వీటిని స్క్రూటినీ చేస్తారు. ఈ తనిఖీలు జరిపినప్పుడు చాలా లోపాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ శాతాన్ని అంకెల్లోను, అక్షరాల్లోనూ రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో తేడా కనిపిస్తే మళ్లీ మొదటి నుంచి లెక్కలు తీయాల్సి ఉంటుంది. చాలా బూత్‌ల్లో ఈ సమస్య తలెత్తింది.
ఒక్క బూత్‌లో ఇబ్బంది వచ్చినా మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్ పోలింగ్ పర్సంటేజ్‌ను ప్రకటించకుండా నిలిపి వేస్తారు. దీని ప్రభావం రాష్ట్ర స్థాయి లెక్కలపైనా ఉంటుంది. అందువల్లనే రాష్ట్ర స్థాయి పోలింగ్ శాతాన్ని ఇంతవరకు ప్రకటించలేకపోయామని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల లెక్కలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వద్దకు వచ్చిన తరువాత వాటిని లెక్కించి ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఆ తరువాత పోలింగ్ పర్సంటేజ్‌పై ప్రకటన విడుదల చేస్తారు.
పోలింగ్ పర్సంటేజ్ ను లెక్కించేటప్పుడు చాలా సార్లు చెకింగ్, రీచెకింగ్‌లు జరపాల్సి ఉంటుందని, అందుకే తుది పర్సంటేజ్ ను డిక్లేర్ చేయడంలో ఆలస్యం తప్పదని అధికారులు అంటున్నారు. ప్రతి ఓటూ విలువైనది కావడంతో ఇంతగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నా-