Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?
గంగలూరు నుంచి నెలసనార్ గ్రామానికి రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ముకేశ్ చంద్రకర్(Mukesh Chandrakar) ఓ కథనాన్ని రాశాడు.
- By Pasha Published Date - 12:18 PM, Sat - 4 January 25

Mukesh Chandrakar : జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ (28) మరణవార్త కలకలం రేపింది. శుక్రవారం రోజు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో ఆయన డెడ్‌బాడీ దొరికింది. కాంక్రీట్‌లో ముకేశ్ చంద్రకర్ డెడ్‌బాడీని సీల్ చేసి.. సెప్టిక్ ట్యాంకులో వేశారు. జనవరి 1వ తేదీన సాయంత్రం నుంచి ముకేశ్ కనిపించకుండా పోయాడు. దీనిపై అతడి అన్నయ్య, టీవీ జర్నలిస్ట్ యుకేష్ చంద్రకర్ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముకేవ్ మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా.. చట్టన్‌పర బస్తీలోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్‌కు చెందిన భూమిలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ మృతదేహం దొరికింది. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, కొందరు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతకీ ముకేశ్ చంద్రకర్ మర్డర్ ఎందుకు జరిగింది ? కారణం ఏమిటి ?
Also Read :New Airports : ఏపీలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులు ఇవే..
ముకేశ్ చంద్రకర్ నేపథ్యం..
- గంగలూరు నుంచి నెలసనార్ గ్రామానికి రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ముకేశ్ చంద్రకర్(Mukesh Chandrakar) ఓ కథనాన్ని రాశాడు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ సహా ముగ్గురు వ్యక్తుల నుంచి ముకేశ్‌కు బెదిరింపులు వచ్చాయి.
- 2021 సంవత్సరంలో బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు అపహరించిన CRPF సిబ్బందిని విడుదల చేయించడంలో ముకేశ్ చంద్రకర్ కీలక పాత్ర పోషించాడు. CRPF కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదలలో ముఖ్య పాత్ర పోషించాడు.
- బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల దాడులు, పోలీసుల ఎన్‌కౌంటర్లు, ఇతర సమస్యలపై ముకేశ్ పెద్దఎత్తున కథనాలు రాశాడు.
- 159,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘బస్తర్ జంక్షన్’ను ముకేశ్ నడిపాడు. అతడి ఛానల్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, మావోయిస్టుల మధ్య వివాదానికి సంబంధించిన వివిధ అంశాలపై వీడియోలను పోస్ట్ చేసేవాడు. గిరిజన సమాజానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను హైలైట్ చేసేవాడు.