HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Who Is The New Cm Of Haryana

BJP: హర్యానా కొత్త సీఎం ఎవరు?.. అవకాశం ఆయనకేనా..?

BJP: ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయనను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు తాము అనుకూలమే అనే మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

  • Author : Latha Suma Date : 08-10-2024 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jharkhand BJP
Jharkhand BJP

Haryana New CM : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకుని నూతన ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లకుగానూ 48 సీట్లు సాధించిన బీజేపీ.. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

Read Also: Congress : హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదు: కాంగ్రెస్

దీనిపై ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అయితే ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నప్పటికీ ఇప్పటికే కాషాయదళం ఛాయిస్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైనీనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఇందులో మరో మాటకు తావులేదని బీజేపీ అధిష్టానం చెబుతున్నట్లు సమాచారం.

ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయనను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు తాము అనుకూలమే అనే మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు సరిగ్గా 200 రోజుల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్ధానంలో అధిష్టానం నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది.

దీనిపై అప్పట్లో పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. ఖట్టర్ వర్గం కూడా సైనీని అప్పట్లో ఆమోదించలేదు. కానీ క్రమంగా అధిష్ఠానం మనసులో ఏముందో తెలుసుకున్న పార్టీ నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆ అస్త్రమే పనిచేసింది. త్వరలో శాసనసభాపక్ష భేటీ ఏర్పాటు చేసి సైనీకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: RK Roja : ఉప ముఖ్యమంత్రి గారూ…పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్‌పై రోజా ట్వీట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Haryana New CM
  • INLD
  • Nayab Singh Saini

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd