HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Whenever People Try To Protest Against Price Rise Bjp Creates Hindu Muslim Rift Mamata Banerjee

Didi Angry: మోదీ సర్కార్ పై దీదీ గుస్సా..వాటి నుంచి దృష్టి మ‌ర‌ల్చ‌డానికే మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టిస్తున్నారు.!!

నరేంద్రమోదీ సర్కార్ తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గుస్సా అయ్యింది.

  • By Hashtag U Published Date - 05:30 AM, Thu - 19 May 22
  • daily-hunt
Mamta
Mamta

నరేంద్రమోదీ సర్కార్ తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గుస్సా అయ్యింది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేసింది. పెరుగుతున్న ధరల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తూ…కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి చెందుతోందని దీదీ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గ్యాస్‌, ఇతర వస్తువుల ధరలను పెంచుతూ.. పేద‌వారి న‌డ్డివిరుస్తోంద‌ని మండిపడ్డారు.

బుధ‌వారం మేదినీపూర్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రసంగించారు మమతా బెనర్జీ. గ్యాస్ లేదా ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా మతపరమైన ఉద్రిక్తతలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రేకెతిస్తుందని ఆరోపించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌ధాన‌ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే పనిచేస్తుందని మమతా ఆరోపించింది.

ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్లించేందుకే మోడీ సర్కార్ మతపరమైన కల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. దేశీయ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా కేంద్రం సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలపై చర్చ జరుగుతోంది. మార్చి 2022లో.. ప్రభుత్వం గృహావసర వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 50 పెంచి రూ. 949.50కి చేర్చింది. ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.08 శాతానికి చేర్చిందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాలు రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపుల సందర్భంగా మత ఘర్షణలు త‌ల్లెత్తాయ‌ని మమతా బెనర్జీ గుర్తు చేశారు. రాష్ట్రానికి బకాయిలు విడుదల చేయడంలో విముఖతపై కేంద్రంపై దీదీ మండిపడుతున్నారు.

పశ్చిమ బెంగాల్ విషయంలో, కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నార. న్యాయబద్ధమైన బకాయిలు చెల్లించడం లేదని ఆమె ఆరోపించింది. MGNREGS, PM ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి వ‌చ్చే బకాయిలను తక్షణమే విడుదల చేయాల‌ని డిమాండ్ చేస్తూ మ‌మతా బెన‌ర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • angry on PM
  • bengal chief minister
  • bjp
  • mamata banerjee
  • national politics

Related News

Jubli Campgin

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో తగ్గేదేలే అంటూ నేతల ప్రచార హోరు

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఇంకో పది రోజుల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ తమ గెలుపు కోసం ప్రతిష్ఠాత్మకంగా పోరాడుతున్నాయి

  • MP Chamala

    MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • BJP leaders in the city arrested ahead of schedule after calling for a siege of the Secretariat

    Minister Post To Azharuddin : అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

  • Jublihils Campign

    Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు

Latest News

  • Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్‌గా అయ్యాడో తెలుసా?

  • SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అల‌ర్ట్‌!

  • India vs South Africa: టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌.. వ‌ర్షం ప‌డితే సౌతాఫ్రికాదే ట్రోఫీ!

  • JD Vance Usha Chilukuri Divorce : ఉషా చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విడాకులు..? ఆ వెంటనే వివాహం?

  • kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

Trending News

    • Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

    • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

    • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd