HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >War Can Come Anytime Rajnath Singh All For Three Force

Three forces : యుద్దం ఎప్పుడైనా రావచ్చు..త్రివిధ దళాలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు..!

Three forces : సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌సింగ్‌ పిలపు నిచ్చారు.

  • Author : Latha Suma Date : 06-09-2024 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajnath Singh
Rajnath Singh

War Can Come Anytime.. Should Be Ready : లక్నోలో జాయింట్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. భారత్‌ ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని , శాంతిని కాపాడడానికి యుద్దం చేయాల్సిన అవసరం రావచ్చని అన్నారు.

సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ భారత్‌ లక్ష్యం..

ఆత్మనిర్భర్‌ భారత్‌లో త్రివిధ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రష్యా – ఉక్రెయిన్‌ , ఇజ్రాయెల్‌ -హమాస్‌ , బంగ్లాదేశ్‌లో అలర్లను ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు . అనుకోకుండా ఇలాంటి పరిస్థితి వస్తే సంసిద్దంగా బలగాలు ఉండాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముందని అన్నారు. సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ భారత్‌ తమ లక్ష్యమన్నారు.

యుద్దాలను ధీటుగా ఎదుర్కొనేలా రెడీ..

భవిష్యత్‌లో వచ్చే యుద్దాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా త్రివిధ బలాలను సిద్దం చేస్తునట్టు రక్షణశాఖ మంత్రి తెలిపారు. యుద్దాలను ధీటుగా ఎదుర్కొనేలా రెడీగా ఉన్నట్టు తెలిపారు. సవాళ్లను ముందుగానే గుర్తించాలని కమాండర్లకు రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో భద్రతపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని కోరారు. సరిహద్దు దేశాల్లో ఉన్న సమస్యలు భారత్‌కు కూడా సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఇవి శాంతికి , స్థిరత్వానికి ఆటంకం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. ప్రపంచంలో పలు దేశాలు యుద్దంతో ప్రభావితమవుతున్నప్పటికి , ఆ ప్రభావం భారత్‌పై లేకుండా చూస్తునట్టు వెల్లడించారు. అయితే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని స్పష్టం చేశారు.

Read Also:Hero Raj Tarun: హీరో రాజ్ త‌రుణ్‌- లావ‌ణ్య కేసులో బిగ్ ట్విస్ట్..! 

మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ , భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్దంగా ఉండాలని ఆర్మీ కమాండర్లతో చెప్పారు రాజ్‌నాథ్‌. జాతీయ భద్రత అన్నిటికంటే ముఖ్యమన్నారు . సాంప్రదాయ యుద్దసామాగ్రితో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలన్నారు. స్పేస్‌ ,ఎలక్ట్రానిక్‌ వార్‌ యుద్ద విధాలనాలపై దృష్టి పెట్టినట్టు రాజ్‌నాథ్‌ తెలిపారు. డేటా , కృత్రిమ మేథను కూడా కూడా యుద్ద విద్యలకు జోడించాలన్నారు. నేరుగా యుద్దంపై ఈ విధానాలు ప్రభావం చూపకపోయినప్పటికి పరోక్షంగా సాయపడుతాయన్నారు. భవిష్యత్‌లో రక్షణరంగంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు కమాండర్ల కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు.

Read Also: GOAT : ‘ది గోట్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Defense Minister Rajnath Singh
  • lucknow
  • Security Forces
  • Three forces
  • war

Related News

Ahmad Vahidi

అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

అహ్మద్ వాహిదీ 2009 నుండి 2013 వరకు అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.

  • War Week

    War : వార్ కు వారం..ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే !!

  • Iran Israel War Schools Shut In Kashmir

    హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

  • War Effect On India

    యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

  • Us Attack Iran

    US Israel Iran War : ఇరాన్ పై యుద్ధం..భారత్ కు తీవ్ర నష్టం

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd