Rashmika : మోడీకి దగ్గరైన రష్మిక..
ముంబైలోని అటల్ సేతు మార్గం నిర్మాణం, దేశంలోని యువ భారత్ కలల గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.
- By Sudheer Published Date - 01:04 PM, Fri - 17 May 24

రష్మిక ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు తెలుగు , తమిళ్ , కన్నడ ప్రేక్షకులకు మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ చిన్నది..యానిమల్ మూవీ తో నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంత బాలీవుడ్ పైనే పెట్టింది. తెలుగు తో పుష్ప 2 తో పాటు మరో మూవీ మాత్రమే చేస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు లోక్ సభ ఎన్నికల వేళ బిజెపి సర్కార్ ఫై ప్రశంసలు కురిపించి మోడీకి దృష్టిలో పడింది.
ముంబైలోని అటల్ సేతు మార్గం నిర్మాణం, దేశంలోని యువ భారత్ కలల గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన డెవలప్‌మెంట్ వల్ల ఎన్నో అసాధ్యంగా భావించే కొన్ని కార్యక్రమాలు సుసాధ్యం అయ్యాయి. నవీ ముంబై నుంచి ముంబై వరకు, ముంబై నుంచి గోవా వరకు 4 గంటల ప్రయాణం 20 నిమిషాల్లో పూర్తవుతుందని ఎవరైనా ఊహించారా? అలాంటి పనిని మోడీ ప్రభుత్వం చేసిందని రష్మిక చెప్పుకొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
అభివృద్దిలో ఇండియా దూసుకెళ్తున్నది. భారత్‌లో ఇది కాదు.. ఇది జరగదు అనే మాట వినిపించడం లేదు. ఏదైనా సాధ్యమే అనేది బిజెపి ప్రభుత్వంలో రుజువైంది. అద్బుతమైన పాలన కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఇండియా ఎంతో పురోగతి సాధించింది. ఇన్ఫాస్ట్రక్చర్, రోడ్ ప్లానింగ్, ప్లానింగ్ అద్బుతంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా పూర్తి చేయలేని పనులు కేవలం 7 సంవత్సరాల్లో పూర్తి చేశారు. అటల్ సేతుతో కనెక్ట్ అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ 20 కిలోమీటర్ల సీ రోడ్డును చాలా త్వరగా పూర్తి చేసింది. యువ భారతం స్మార్ట్ కంట్రీగా మార్చింది. యంగ్ ఇండియన్ అంతా విజనరీగా ఉన్నారు. ప్రస్తుతం యువ భారతం సరైన ప్రభుత్వానికి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది అంటూ బిజెపి సర్కార్ కు సపోర్ట్ గా మాట్లాడింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ ను బిజెపి శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు.
https://x.com/ANI/status/1790365356231389519?
Read Also : AP : టీడీపీకి ఓటు వేసాడని కార్యకర్త చెవిని కోసేసిన వైసీపీ నేత