Vinesh Phogat Contest From Julana: జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన వినేష్ ఫోగట్..!
పార్టీ విడుదల చేసిన 31 మంది అభ్యర్థుల జాబితాలో సీఎం నయాబ్ సైనీపై లాడ్వా నుంచి మేవా సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయభాన్ హోడల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
- By Gopichand Published Date - 09:51 AM, Sat - 7 September 24

Vinesh Phogat Contest From Julana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో 31 మంది అభ్యర్థులను పార్టీ బరిలోకి దించింది. ఈ జాబితాలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పేరు కూడా చేరింది. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగట్‌ను (Vinesh Phogat Contest From Julana) కాంగ్రెస్ పోటీకి దింపింది. రాష్ట్ర రాజకీయాల్లో జులానా అసెంబ్లీ స్థానం కీలక పాత్ర పోషిస్తోంది. హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం జింద్ జిల్లాలోకి వస్తుంది. ఇది ఒక ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు మరింత ప్రత్యేకంగా మారింది.
పార్టీ విడుదల చేసిన 31 మంది అభ్యర్థుల జాబితాలో సీఎం నయాబ్ సైనీపై లాడ్వా నుంచి మేవా సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయభాన్ హోడల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శుక్రవారం రాత్రి మొత్తం 31 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 31 మంది బరిలో ఉన్నారని కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
Also Read: Express Derail In Madhya Pradesh: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రెండు కోచ్‌లు..!
శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా శుక్రవారం తమ రాజకీయ యాత్రను ప్రారంభించారు. వీరిద్దరూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన తర్వాత వినేష్ ఫోగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థిగా ఉండవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అనుకున్నట్లు గానే ఆమెను కాంగ్రెస్ పార్టీ జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. అయితే వినేష్ రాజకీయాల్లో ఎంత మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు వినేష్ మోదీ ప్రభుత్వం తనకు ఇచ్చిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.