HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India
  • ⁄Up Shopkeeper Offers Free Beer On Purchase Of Smartphones Arrested

2 Beers Free On 1 Phone: ఫోన్ కొంటే 2 బీర్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం.. చివరికి ఏమైందో తెలుసా..?

ఉత్తరప్రదేశ్‌‌ (Uttar Pradesh)లోని భదోహి జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరీ రోడ్ ఏరియాకు చెందిన రాజేష్ మౌర్య అనే స్మార్ట్‌ఫోన్ స్టోర్ నిర్వాహకుడు హోలీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఇది.

  • By Gopichand Published Date - 06:49 AM, Sat - 11 March 23
2 Beers Free On 1 Phone: ఫోన్ కొంటే 2 బీర్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం.. చివరికి ఏమైందో తెలుసా..?

ఉత్తరప్రదేశ్‌‌ (Uttar Pradesh)లోని భదోహి జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరీ రోడ్ ఏరియాకు చెందిన రాజేష్ మౌర్య అనే స్మార్ట్‌ఫోన్ స్టోర్ నిర్వాహకుడు హోలీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఇది. ఫోన్ సేల్స్‌ పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీ అమలు చేయాలని చూశాడు.పాంప్లెట్లు ప్రింట్ చేయించి పంపిణీ చేశాడు. “హోలీ బంపర్ ధమాకా.. ఒక స్మార్ట్ ఫోన్ కొనండి.. రెండు బీర్లు ఉచితంగా పొందండి” అంటూ పోస్టర్లతో ఆఫర్ గురించి ప్రచారం చేయించాడు. తన దుకాణం బయట కూడా పోస్టర్లు పెట్టించాడు. మార్చి 3 నుంచి 7 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ పరిమితి ఉంటుందని షరతు విధించాడు.

■ చివరకు జైలుపాలు

రాజేష్ మౌర్య ప్రకటించిన ఆఫర్ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే అధికారులు కలగజేసుకుని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం చట్ట విరుద్ధం అంటూ రాజేష్ మౌర్యను హెచ్చరించారు. కానీ అప్పటికే అందరికీ ఆఫర్ గురించి తెలిసిపోవడంతో పెద్దఎత్తున కస్టమర్లు తరలి వచ్చారు. రాజేష్ స్టోర్ బయట భారీగా క్యూ లైన్ ఏర్పడింది.ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కస్టమర్లను చెదరగొట్టారు. షాప్ యజమాని రాజేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాజేష్ ప్రకటించిన ఆఫర్ వల్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కానీ, చివరికి అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది.

Also Read: Viveka : వివేకా హ‌త్య‌కు మ‌రో పెళ్లి లింకు, అవినాష్ కొత్త ట్విస్ట్‌!

■ చట్టవిరుద్ధమైన ఆఫర్ ప్రకటించడంతో

కస్టమర్లను ఆకట్టుకునేందుకు లిక్కర్‌, దాని అనుబంధ ప్రొడక్టులను ఆఫర్ల కింద ప్రకటించకూడదు. ఇది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) రూపొందించిన కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినట్లే. చట్ట ప్రకారం ఇది నేరం. కేవలం లైసెన్స్ పొందిన యజమానులు మాత్రమే ఈ తరహా ఆఫర్లు ప్రకటించే వీలుంది. దేశంలో 21 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఆల్కహాల్ విక్రయించడం చట్ట విరుద్ధం. శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు యజమానిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ ఆదేశాల ప్రకారం రాజేష్ అరెస్టు అనంతరం దుకాణానికి పోలీసులు సీల్ వేశారు.

Telegram Channel

Tags  

  • 2 Beers Free On 1 Phone
  • smartphones
  • UP Shopkeeper
  • Uttar pradesh
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

8 Killed: కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి 8 మంది మృతి

8 Killed: కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని చందౌసీ ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి (Roof Collapse) ఎనిమిది మంది (8 Killed) మరణించారు. 11 మందిని రక్షించారు. ఇప్పటికీ కొంతమంది శిథిలాల కింద పడి ఉన్నారు.

  • Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!

    Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!

  • Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఐదుగురు సజీవదహనం

    Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఐదుగురు సజీవదహనం

  • Tihar Jail: తీహార్ జైలులో ఖైదీ నుంచి సర్జికల్ బ్లేడ్స్, డ్రగ్స్ స్వాధీనం

    Tihar Jail: తీహార్ జైలులో ఖైదీ నుంచి సర్జికల్ బ్లేడ్స్, డ్రగ్స్ స్వాధీనం

  • Tractor Accident: డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన ట్రాక్టర్, చక్కర్లు కొడుతున్న వీడియో!

    Tractor Accident: డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన ట్రాక్టర్, చక్కర్లు కొడుతున్న వీడియో!

Latest News

  • Jharkhand: 4 రోజుల నవజాత శిశువు మృతి.. పోలీసులే కారణమా..?

  • Kotamreddy Giridhar Reddy : ప‌సుపుమ‌య‌మైన నెల్లూరు.. నేడు టీడీపీలో చేర‌నున్న కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి

  • Mamata Banerjee: నవీన్ పట్నాయక్‌ తో మమతా బెనర్జీ భేటీ.. కొత్త ఫ్రంటే లక్ష్యమా..?

  • April 6 to May 2: వృషభ రాశిలో శుక్రుడి సంచారం.. 6 రాశుల వారిపై కనక వర్షం

  • Hail Rains: తెలంగాణలో నేడు,రేపు వడగళ్ల వర్షాలు

Trending

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: