HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Viveka Another Marriage Link To Vivekas Murder Avinashs New Twist

Viveka : వివేకా హ‌త్య‌కు మ‌రో పెళ్లి లింకు, అవినాష్ కొత్త ట్విస్ట్‌!

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి(Viveka) హ‌త్య వెనుక కొత్త కోణాన్ని

  • Author : CS Rao Date : 10-03-2023 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka Murder
Viveka

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి(Viveka) హ‌త్య వెనుక కొత్త కోణాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy)  ఆవిష్క‌రించారు. మూడుసార్లు సీబీఐ విచార‌ణను ఎదుర్కొన్న ఆయ‌న ఇప్పుడు కొత్త క‌థ‌ను చెబుతున్నారు. ఆయ‌న చెబుతోన్న దాని ప్ర‌కారం “2006 నుంచి వివేకాకు ఒకరితో సంబంధం ఉంది. 2011లో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కోసం ఇస్లాం చట్టం ప్రకారం తన పేరు షేక్ మహ్మద్ అక్బర్ అని కూడా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత షేక్ షహెన్షా అని ఒకబ్బాయి కూడా పుట్టాడు. భవిష్యత్తులో ఆ కుర్రాడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలన్న ఆలోచన వివేకాలో ఉండేది” అని అవినాశ్ రెడ్డి కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక  మ‌రో పెళ్లి(Viveka) 

వాస్త‌వం ఇలా ఉండ‌గా, మరో కోణంలో తప్పుదోవలో వెళుతోందని అవినాష్ రెడ్డి(Avinash Reddy) చెబుతున్నారు. రెండో భార్యకు, ఆమె కుమారుడికి వివేకా ఇవ్వదలిచిన ఆస్తి తాలూకు పత్రాలను ఎవరు అడ్డుకున్నారో ఏమో కానీ, తనకు తెలిసినంత వరకు ఆస్తి కోసం జరిగిన హత్య గా తేల్చారు. `ద‌స్త‌గిరి అప్రూవర్ గా మారి చెప్పింది ఒక కట్టుకథ. రూ.8 కోట్ల డబ్బు కోసం గొడవ మొదలైందని చెబుతున్నారు. వివేకా గారు మొత్తం తనకే కావాలన్నట్టు… వీళ్లేమో నువ్వు సగం తీసుకో మేం సగం తీసుకుంటాం అన్నట్టు చెబుతున్నారు. మాటామాటా పెరిగి ఆయనపై దాడి జ‌రిగిందని అవినాష్ చెబుతున్నారు. కానీ ఆ బెంగళూరు సెటిల్ మెంటే ఫెయిలైందని, అవి ఫోర్జరీ పత్రాలు అని 8 మంది సాక్షులే చెప్పారు. లేని డబ్బు కోసం కొట్లాడుకుని చంపేస్తారా?” అని అవినాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ద‌స్త‌గిరి అప్రూవర్ గా మారి చెప్పింది ఒక కట్టుకథ

అంతేకాకుండా, ఘటన స్థలంలో లేఖను మాయం చేశారని, తాను వెళ్లేసరికి లేఖ ఉందని, కానీ, సునీత భర్త రాజశేఖర్ ఆ లేఖను దాచిపెట్టారని ఆరోపించారు. ఆ లేఖలో కంటెంట్ ను ఎక్కడా చెప్పవద్దని పీఏ కృష్ణారెడ్డికి స్పష్టం చేశారని వెల్లడించారు. “లేఖను, సెల్ ఫోన్ ను దాచిపెట్టడం తప్పు కాదా? వాళ్లు పొమ్మంటేనే నేను ఘటన స్థలం వద్దకు వెళ్లాను. పోనీ లేఖ గురించి నాకైనా చెప్పాలి కదా. ఆ విషయంలో లేఖ గురించి చెప్పకుండా నన్ను అక్కడికి ఎందుకు వెళ్లమన్నట్టు? వివేకాకు (Viveka) గుండెపోటు అని నేను ఏ ఒక్కరికీ చెప్పలేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే నేను ఆ విధంగా చెప్పినట్టు చిత్రీకరించింది. నేను చేసిందల్లా అక్కడి ఘటనను చూసి బంధుమిత్రులకు ఫోన్ చేసి చెప్పడమే. ఇందులో తప్పేముంది? అంతిమంగా న్యాయమే గెలుస్తుంది” అని అవినాశ్ రెడ్డి కొత్త కోణాన్ని ఆవిష్క‌రించారు.

Also Read : Viveka Murder : వివేక మర్డర్ కేసులో వైసీపీ ఎంపీకి బిగుస్తున్న ఉచ్చు.. నేడు సీబీఐ విచార‌ణ‌కు తండ్రీకొడుకులు

వివేకా హత్య(Viveka) కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని(Avinash Reddy) శుక్ర‌వారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణ కోసం ఈ ఉదయం 10.30 గంటలకే సీబీఐ కార్యాలయానికి వచ్చానని, ఉదయం 11.00 గంటల నుంచి ఒంటి గంట వరకు తనను విచారించారని వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని సీబీఐ విచారణ అధికారి కోర్టుకు వెళ్లారని, తనను సీబీఐ కార్యాలయంలోనే ఉండాలని చెప్పారని అవినాశ్ రెడ్డి వివరించారు. సీబీఐ అధికారి కోర్టు నుంచి వచ్చి, ఇవాళ్టికి విచారణ ముగిసిందని చెప్పారని, పిలిచినప్పుడు మరోసారి రావాలని చెప్పార‌ని వివ‌రించారు.

విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని(Avinsh Reddy)

“గతంలో రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యాను. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరినా గత రెండు పర్యాయాలు పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నేను ఇప్పటిదాకా సీబీఐ కార్యాలయంలో ఉండడంతో కోర్టులో ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు.ఇక, గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు. అది టీడీపీ టేక్ ఔట్ అంటే బాగుంటుంది. తప్పుడు ఎవిడెన్సులతో అన్యాయంగా అమాయకులను ఇరికించడం తప్పు. ఈ దర్యాప్తులో కీలక అంశాలను పక్కనబెట్టి చాలా సిల్లీ అంశాలను తెరపైకి తెచ్చారు. మీకు ఇది కొత్తేమో కానీ, ఓ ఎంపీ సీటు కోసం ఈ హత్య జరిగిందంటే మా జిల్లాలో నవ్వుతారు.` అంటూ అవినాష్ రెడ్డి(Avinash Reddy) చెప్పారు.

ఎంతదూరం వెళ్లయినా న్యాయపోరాటం (Viveka)

వివేకా (Viveka)చనిపోయే రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లు డోర్ టు డోర్ తిరిగారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డికి ఓటేయండి , ఎంపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డికి (Avinash Reddy)ఓటేయండి అని ఆయన ప్రచారం చేశారు. కానీ వీళ్లు ఆ కోణంలో విచారించడంలేదు. కుట్రలకు ఉపయోగపడే స్టేట్ మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఒక అప్రూవర్ చెప్పిన కట్టుకథను అడ్డంపెట్టుకుని ఒక వ్యక్తినే లక్ష్యంగా పెట్టుకుని విచారణ సాగిస్తున్నారు. ఇది తప్పు ఎవరూ కూడా దీన్ని హర్షించరని అవినాష్ అంటున్నారు. `ఇప్పటివరకు మీడియా ఎన్నో విమర్శలు చేసింది. మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నా, మనం ఎలాంటి తప్పు చేయలేదు అని కార్యకర్తలకు గట్టిగా హామీ ఇస్తున్నా. ఎంతదూరం వెళ్లయినా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని అవినాశ్ రెడ్డి వెల్ల‌డించారు.

Also Read : Vivekananda Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్! ఆయన అరెస్ట్ పై ఉత్కంఠ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI questioning
  • jaganmohan reddy
  • MP avinash reddy
  • Viveka Murder Case

Related News

Avinash Reddy

లోక్‌సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

Avinash Reddy  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరల అంశం చర్చకు వచ్చింది. కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో చికెన్ ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అసలు ఈ ధరలు పెరిగినట్లు ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిట

    Latest News

    • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

    • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

    • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

    • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

    • లోక్‌సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd