Unite Opposition : విపక్ష కూటమికి నితీష్ జై, ఢిల్లీలో భేటీ
కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం (Unite Opposition) అయింది.
- Author : CS Rao
Date : 12-04-2023 - 3:28 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం (Unite Opposition) అయింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ ఇప్పుడు యూపీఏ(UPA) పక్షాన నిలుస్తోంది. అందుకు సంకేతంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి జనతాపరివార్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి మోడీని ప్రధాని పదవి నుంచి తొలగించడానికి అందరూ ఐక్యంగా ముందుకు నడవాలని ఆ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం (Unite Opposition)
ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి (Unite Opposition) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వీ యాదవ్ హాజరు కావడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ఈ సమావేశం నాంది పలకనుంది. కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్) (జెడియు), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అగ్ర నాయకులు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని నిర్ణయించారు.
ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్
జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశం కీలకంగా విపక్షాలు భావిస్తున్నాయి. దీన్నో “చారిత్రక సమావేశం` గా (Unite Opposition) కాంగ్రెస్ భావిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుంది. ఆ విషయాన్ని మంగళవారం సోనియగా చెప్పగా, బుధవారం ఖర్గే, రాహుల్ వెల్లడించారు. విపక్ష పార్టీలన్నింటితో కలిసి (UPA)వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ వెళుతుందని చెప్పడం గమనార్హం.
ఆర్జేడీతో పాటు ఎస్పీ, జేడీయూ కూడా యాక్టివ్ రోల్
ప్రతిపక్ష పార్టీలను ఏకం. (Unite Opposition) చేసేందుకు “చారిత్రాత్మకమైన అడుగు ఢిల్లీ వేదికగా బుధవారం సమావేశం ద్వారా పడినట్టు రాహుల్ భావిస్తున్నారు. ఇదో ప్రక్రియగా చెబుతూ దేశం పట్ల ప్రతిపక్ష దృష్టిని పెంచుతుందని అన్నారు. వీలైనన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి పనిచేయాలని నితీష్ ఉద్ఘాటించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు తన అధికారిక హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల గొంతును పెంచడానికి, దేశానికి కొత్త దిశను అందించడానికి ప్రతిజ్ఞ జరిగిందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, దేశాన్ని కాపాడతాం’ అంటూ హిందీలో ట్వీట్ చేస్తూ విపక్షాలను(UPA) ఆకర్షించారు.
Also Read : Rahul Gandhi: అదానీ షెల్ కంపెనీల్లో ఉన్న బినామీ ఆస్తులు ఎవరివి, బీజేపీ సమాధానం చెప్పాల్సిందే!
ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడిన తరువాత జరిగిన నిరసనల్లో ఆప్, టీఎంసీ, బీఆర్ఎస్, ఎస్పీ, బీఎస్పీ తదితర 18 పార్టీలు కలిసి నడిచాయి. ఇప్పటి వరకు విపక్ష వేదికలకు దూరంగా ఉంటోన్న జేడీయూ, బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్ కూడా ఇప్పుడిప్పుడే కలిసి వస్తున్నాయి. జనతాపరివార్ లో కీలక పార్టీగా ఉన్న ఎస్పీ విపక్షాల ఐక్యత (Unite Opposition) దిశగా నడుస్తోంది. ఇప్పుడు ఆర్జేడీతో పాటు ఎస్పీ, జేడీయూ కూడా యాక్టివ్ రోల్ పోషించడానికి రెడీ అయ్యాయి. ఈ పరిణామం విపక్షాల (UPA) కోణంలో చారిత్రకంగా కనిపిస్తోంది.
Sonia Gandhi: పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు..సోనియా