Union Budget : ఎన్నికల బడ్జెట్ , రాష్ట్రపతి స్పీచ్ లో మోడీ సర్కార్ కు ప్రశంసలు
బడ్జెట్ (Union Budget) సమావేశాల ప్రారంభంలోనే రాజకీయ కోణాన్ని సంతరించుకుంది.రాష్ట్రపతి ప్రసంగంలో బోర్డర్ ఇష్యూలను పొందుపరిచారు.
- By CS Rao Published Date - 11:58 AM, Tue - 31 January 23

పార్లమెంట్ బడ్జెట్ (Union Budget) సమావేశాల ప్రారంభంలోనే రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. తొలి రోజు రాష్ట్రపతి(President of India) ప్రసంగంలోని అంశాల్లోని హైలెట్ పాయింట్ గా బోర్డర్ ఇష్యూలను పొందుపరిచారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా మాంద్యం నెలకొన్న క్రమంలో భారత్ దూసుకుపోతుందని చెప్పే ప్రయత్నంలా రాష్ట్రపతి ప్రసంగం ఉంది. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది.
పార్లమెంట్ బడ్జెట్ (Union Budget)
దేశ సరిహద్దు అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా బలమైన ప్రభుత్వం ఉందనే సంకేతాలు ఇచ్చేలా రాష్ట్రపతి(President of India) ప్రసంగం సాగింది. అంతేకాదు, ప్రత్యర్థి దేశాల మీద సర్టికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రసంగం పాఠవం ఉంది. భారత్ ఆత్మనిర్భర్ దిశగా వెళుతోందని 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని పాలనపై ప్రశంసలు కురిపించేలా ఆద్యంతం స్పీచ్ లోని ప్రధాన అంశాలు ఉన్నాయి. అభివృద్ధి దిశగా భారత్ వెళుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్లమెంట్(Union Budget) వేదికగా ముర్ము చేసిన తొలి బడ్జెట్ ప్రసంగం ఇదే.
Also Read : Budget 2023: బడ్జెట్ లో వందే భారత్ రైళ్ల కేటాయింపు.. ఎవరికి లాభం?
ఆజాదీ కా అమృత్ మహోత్సవం గురించి రాష్ట్రపతి ముర్ము వివరించారు. నారీ, యువశక్తి ద్వారా భారత్ నిర్మాణం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. పేదలను లేని భారత్ గా మార్చడానికి బలమైన ప్రభుత్వం కేంద్రంలో ఉందని అన్నారు. రాబోవు 25 ఏళ్లు భారత్ కు ఎంతో ప్రతిష్టాత్మకమని రాష్ట్రపతి తన ప్రసంగంలో దిశానిర్దేశం చేయడం విశేషం. మేకిన్ ఇండియాకు ఈ ఏడాది ఎంతో కీలకమని వెల్లడించారు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో…
ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఉభయ సభలనుద్దేశించి స్పీచ్ ఇచ్చారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుతం 36 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే.. అదానీ – ఎల్ఐసీ, బీబీసీ- మోదీ డాక్యుమెంటరీ వివాదంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పార్లమెంట్ లో వాయిదా తీర్మానాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాటికి బదులు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : Budget : రాబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. మంగళవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు, ఆ తర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తారు. 27 సార్లు సభ సమావేశం కానుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని..
కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని, ఇందుకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ తెలిపింది. బహిష్కరణకు గల కారణాన్ని నేటి మధ్యాహ్నం విజయ్ చౌక్ వద్ద వెల్లడిస్తామన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కేశవరావు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కావాలనే రాజ్యాంగపరమైన సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. బడ్జెట్‌ను ఆమోదించకపోవడం అంటే ప్రభుత్వం నడవకుండా అడ్డుకోవడమేనని అన్నారు. బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను ఈ సమావేశాల్లో ఎండగడతామని అన్నారు.

Related News

Rahul Gandhi: రాహుల్ గాంధీ విషయంపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్, కవిత?
తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీ ఊహించని షాక్ ఎదురయ్యింది. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు