J & K : కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాద సహచరుల అరెస్టు
J & K : బుచిపోరా కవూసా ఆరేస్ వద్ద చెకింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాద సహాయకులను అరెస్ట్ (Two terrorist associates arrested in Kashmir) చేశారు.
- By Sudheer Published Date - 10:01 AM, Tue - 6 May 25

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని సాధించాయి. బుద్గాం (J-K’s Budgam) జిల్లా మాగ ప్రాంతంలోని బుచిపోరా కవూసా ఆరేస్ వద్ద చెకింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాద సహాయకులను అరెస్ట్ (Two terrorist associates arrested in Kashmir) చేశారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి.
Kiara Advani : బేబీ బంప్ తో ఆ ఈవెంట్లో పాల్గొన్న గేమ్ ఛేంజర్ భామ.. మొదటి ఇండియన్ నటిగా రికార్డ్..
అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి గ్రనేడ్‌లు, ఆయుధాలు వంటి అనేక ప్రమాదకర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందించేందుకు స్థానిక ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి.
ఇప్పటికే ఏప్రిల్ 22న పహల్గామ్(Pahalgam Attack)లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి స్పందనగా కశ్మీర్ లో భద్రతా దళాలు తనిఖీలు, నిఘా చర్యలు ముమ్మరం చేశాయి. తాజా అరెస్టులు భద్రతా సిబ్బందికి లభించిన విజయంగా భావించబడుతున్నాయి. కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.