Aditya L1 Spacecraft : భూమికి బైబై చెప్పిన ‘ఆదిత్య-ఎల్1’.. సూర్యుడి దిశగా స్పేస్ క్రాఫ్ట్
Aditya L1 Spacecraft : సూర్యుడిలో దాగిన సీక్రెట్స్ పై రీసెర్చ్ చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగంలో ఇంకో కీలక ఘట్టం చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 08:43 AM, Tue - 19 September 23
Aditya L1 Spacecraft : సూర్యుడిలో దాగిన సీక్రెట్స్ పై రీసెర్చ్ చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగంలో ఇంకో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇస్రో ప్రయోగించగా. తాజాగా మంగవారం తెల్లవారుజామున దానికి ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచారు. దీంతో స్పేస్ క్రాఫ్ట్ భూమి కక్ష్యను వదిలిపెట్టి.. సూర్యుడి సమీపంలోని ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1 (Trans-Lagrangian Point 1) దిశగా జర్నీని మొదలుపెట్టింది. ఈవివరాలను ఇస్రో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Also read : Dream About Shri Ram : ‘రాముడు కలలోకి వచ్చి నాతో అలా చెప్పాడు’.. బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రాన్స్ లాగ్రేంజియన్ పాయింట్ 1 ను ఎల్1 పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇది భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి నుంచి చంద్రుడు ఉన్న దూరానికి ఇది దాదాపు 4 రెట్లు ఎక్కువ. ఆదిత్య-ఎల్ 1 స్పేస్‌క్రాఫ్ట్ ఇంకో 110 రోజులపాటు ప్రయాణించి ఎల్1 పాయింట్‌ను చేరుకుంటుంది. ఆ తర్వాత ఇంకోసారి కక్ష్యను పెంచి.. స్పేస్ క్రాఫ్ట్ ను లాగ్రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి (Aditya L1 Spacecraft) ప్రవేశపెడతారు. సూర్యుడికి, భూమికి మధ్య ఉండటం వల్ల ఎల్1 పాయింట్ దగ్గర గురుత్వాకర్షణ స్థిరంగా ఉంటుంది.
Aditya-L1 Mission | Off to Sun-Earth L1 point | The Trans-Lagrangean Point 1 Insertion (TL1I) manoeuvre is performed successfully. The spacecraft is now on a trajectory that will take it to the Sun-Earth L1 point. It will be injected into an orbit around L1 through a manoeuvre… pic.twitter.com/UNJajadXsQ
— ANI (@ANI) September 18, 2023
Tags
Related News
Hyderabad ECIL – Aditya L1 : ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగంలో హైదరాబాద్ ఈసీఐఎల్, మిధానీ పరికరాలు
Hyderabad ECIL - Aditya L1 : సూర్యుడిపై రీసెర్చ్ కోసం ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది.