Green Invitation: ఓరి మీ ప్రేమ ‘మొక్క’ కానూ..!
పెళ్లంటే.. ‘‘తాళాలు, తలంబ్రాలు, మూడుముళ్లు, ఏడు అడుగులు’’ అని అభివర్ణిస్తుంటారు పెద్దలు. కానీ ఇదే మాటను పర్యావరణ ప్రియుల్ని అడిగితే.. చెత్తాచెదారం, వాడిపాడేసిన వస్తువులు, వ్యర్థాలు అని సమాధానమిస్తారు.
- By Balu J Published Date - 03:03 PM, Fri - 26 November 21

పెళ్లంటే.. ‘‘తాళాలు, తలంబ్రాలు, మూడుముళ్లు, ఏడు అడుగులు’’ అని అభివర్ణిస్తుంటారు పెద్దలు. కానీ ఇదే మాటను పర్యావరణ ప్రియుల్ని అడిగితే.. చెత్తాచెదారం, వాడిపాడేసిన వస్తువులు, వ్యర్థాలు అని సమాధానమిస్తారు. అంగరంగ వైభవంగా జరుపుకునే పెళ్లిల మాటున పర్యావరణాన్ని హనీ కలిగించే వ్యర్థాల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వెడ్డింగ్ కార్డు నుంచి భోజనాల వరకు ప్రతిదీ ఎంతోకొంత వేస్టేజ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఓ జంటను ఆలోజింపచేశాయి. పర్యావరణాన్నికి మంచిచేసేలా ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నారు. ఇంకేముంది అనుకున్న వెంటనే ఆచరణలో తెచ్చి గొప్ప పర్యావరణ ప్రియులుగా పేరు తెచ్చుకున్నారు.
పెళ్లి అనగానే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ గొప్పతనం చాటుకునేందుకు పెళ్లికార్డులను లెక్కకుమించి ప్రింటింగ్ చేయిస్తారు. అవసరమైన డిజైన్స్ దగ్గరుండి చేయించుకుంటారు. ప్రింట్ కొట్టిన కార్డులన్నీ బంధుగణం మొత్తానికి చేరొచ్చు. చేరకపోవచ్చు కూడా. అందులోని చాలా కార్డులన్నీ మూలకు చేరుతాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తిరుచ్చికి చెందిన ఓ జంట మంచి ఆలోచన చేశారు. మనోజ్ ధర్మర్, దివ్య తమ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ను విత్తనాలతో ‘ప్లాంట్బుల్’ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఇది సీడ్ పేపర్. మాపై మీ ప్రేమను చూపడానికి, దానిని కలలతో మడిచి పాతిపెట్టండి. ప్రేమ ఏదో ఒకరోజు వికసిస్తుంది’’ అనే మెసేజ్ ఇచ్చారు. చాలా వరకు వెడ్డింగ్ కార్డులపై దేవుళ్ల పేర్లు లేదా శ్లోకాలు రాయబడి ఉంటాయి. ఇవి చాలావరకు వెస్టేజ్ అవుతుంటాయి. రెండు కుటుంబాలను ఉత్తమంగా చేయడానికి, ఈ విత్తన ఆహ్వానాలపై నిర్ణయం తీసుకున్నాను” అని మనోజ్ చెప్పారు.
తిరుచ్చిలో అలాంటి ఆహ్వానాలు అందుబాటులో లేకపోవడంతో మనోజ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్డర్ ఇచ్చాడు. “అవి పూల విత్తనాలు. పువ్వులపై కూర్చున్న అనేక కీటకాలు, తేనెటీగలకు ప్రయోజనం చేకూరుస్తాయి” అని ఆయన చెప్పారు. ‘గ్రీన్’ ఆహ్వానంతో పాటు, ఈ జంట మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ సీసాలు కప్పులకు బదులు చెరకు బగాస్‌తో తయారు చేసిన కప్పులను ఆర్డర్ చేశారు. అంతేకాదు.. ఇరుంగళూరులోని మియావాకి అడవుల్లో 1,000 మొక్కలు నాటాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. మనోజ్ ఆరేళ్లుగా పర్యావరణ కార్యకర్త. ఉయ్యకొండలోని వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. షైన్ ట్రీచీ అనే పర్యావరణ NGOని నడుపుతున్నాడు.
Related News

MS Dhoni Photo: కెప్టెన్ కూల్ క్రేజ్ మాములుగా లేదుగా.. పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో..!
ఈ వెడ్డింగ్ కార్డ్కి రెండు వైపులా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాలు (MS Dhoni Photo) ఉన్నాయి. ఇది కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూల్ జెర్సీ నంబర్ 7 కూడా ముద్రించబడింది.