Age of Consent: 16 ఏళ్లకే అమ్మాయిలు శృంగారం చేసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు
యవ్వనంలోకి అడుగుపెట్టిన చాలా మంది యువకులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సంబంధం కలిగి ఉంటారని కోర్టు గుర్తుచేసింది.
- By Balu J Published Date - 11:41 AM, Mon - 3 July 23
భారతదేశ చట్టాలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంటాయి. అయితే మారుతున్న పరిస్థితులు, నేటి తరం యువత ఆలోచలనకుగుణంగా చట్టాలు సైతం సవరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మాయిలు సెక్స్‌లో పాల్గొనే వయసు (ఏజ్ ఆఫ్ కన్సెంట్)పై మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. బాలికలు తమ ఇష్టపూర్వకంగా 16ఏళ్ల వయసులో శృంగారంలో పాల్గొనవచ్చని అభిప్రాయపడింది. మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అమ్మాయిల శృంగార వయసును 18 సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించింది.
యవ్వనంలోకి అడుగుపెట్టిన చాలా మంది యువకులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సంబంధం కలిగి ఉంటారని కోర్టు గుర్తుచేసింది. ఈ విషయంలో తప్పు ఇద్దరిదీ ఉన్నప్పటికీ మైనర్ బాలికలపై అత్యాచారం అనే కోణంలో యువకులపై పోక్సో చట్టం, అత్యాచారం వంటి నేరాలను నమోదు చేస్తున్నారని కోర్టు తెలిపింది. గ్వాలియర్‌లోని తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాహుల్ జాతవ్ అనే వ్యక్తిపై 14 ఏళ్ల బాలిక అత్యాచార కేసు నమోదు చేసింది. 2020 జూలై 17న పోలీసులు రాహుల్‌ని అరెస్ట్ చేశారు. నాటి నుంచి రాహుల్ జైలు జీవితం గడుపుతున్నాడు.
కేసు వివరాల ప్రకారం.. 2020 జనవరి 18న బాధితురాలు కోచింగ్ కోసం రాహుల్ వద్దకు వెళ్లింది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రాహుల్ మత్తు మందు కలిపిన జ్యూస్ ఆమెకు ఇచ్చాడు. బాధితురాలు స్పృహతప్పి పడిపోయిన తరువాత ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఇదే బాలిక మరో వ్యక్తిపైన గతంలో ఆరోపణలు చేసిందని రాహుల్ తరపు న్యాయవాది రాజమణి బన్సాల్ కోర్టుకు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని దూరపు బంధువు మోసం చేశాడని ఆరోపించిందని, ఆ కేసులో ఇరువురి అంగీకారంతోనే వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడిందని రాహుల్ తరుపు న్యాయవాది చెప్పారు. వారిద్దరి మధ్యలో తన క్లయింట్ రాహుల్ చిక్కుకున్నాడని, అందువల్ల రాహుల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్ట్ రాహుల్ జాతవ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
Also Read: Drones: వాహనదారులపై డ్రోన్ నిఘా, హద్దు మీరితే చలాన్ కట్టాల్సిందే!
Related News
Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.