HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Thats Bjp Timing

BJP: దటీజ్ బిజెపి టైమింగ్

ఇండియా (INDIA) అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. దాన్ని బిజెపి (BJP) వారు మరోరకంగా అర్థం చేసుకున్నారు.

  • By Hashtag U Published Date - 10:08 AM, Fri - 8 September 23
  • daily-hunt
BJP
Say 'jai Bajrang Bali' While Voting.. Pm Modi

By: డా. ప్రసాదమూర్తి

BJP: ఇండియా (INDIA) అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. దాన్ని బిజెపి (BJP) వారు మరోరకంగా అర్థం చేసుకున్నారు. యూనిటీ అంతా తమ డైవర్సిటీ పాలిటిక్స్ లోనే ఉందని వారు గ్రహించిన తత్వ సారం బిజెపి రాజకీయ గీతాసారంగా భావించాలి. ‌ కీలెరిగి వాత పెట్టాలి అన్న సామెత అర్థం బిజెపికి తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదని చెప్పాలి. ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అది అధికార బిజెపి అనుసరించే వ్యూహంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే బిజెపి టైమింగ్ కి ఎవరైనా సెల్యూట్ చెప్పాల్సిందే.

రెండు మూడు ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహం. ఏముందిలే చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదురై ఉన్న ఈ పార్టీలు కలిసేదెప్పుడు, కలిసినా కలిసి నడిచేదెప్పుడు, నడిచినా ఆ నడక ఒక తీరుగా సాగేదెప్పుడు, సాగినా అది గమ్యం చేరేదెప్పుడు.. ఇలాంటి ఊహాపోహలలో బిజెపి మొదట కొట్టుకుపోయింది. కానీ ఆ వెంటనే తేరుకొని కళ్ళు తెరిచి ఇక లాభం లేదనుకొని ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేయడం మొదలుపెట్టింది. అదిగో ఆ సందర్భంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు అంటూ ఒక బాంబు పేల్చింది.

మణిపూర్ మారణకాండ , నూహ్ లాంటి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు, నిరుద్యోగం, అధిక ధరలు, అదానీ కార్పొరేట్ డొల్ల కంపెనీల కహానీ వ్యవహారం.. ఇలా రకరకాల సమస్యలతో ప్రజల ముందుకు వెళ్దామని ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్న సమయంలో, ఒక్కసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మాట వినగానే అందరూ ఆ సమావేశాలు దేనికి? ఎందుకు ప్రతిపక్షలతో సంప్రదించకుండా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు? దేనికి ఇలా చేస్తున్నారు? ఇది రాజ్యాంగబద్ధమా ఇట్లాంటి ఆలోచనల వైపు ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి.

Also Read: Telangana : జీతాలు అందడంలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు మృతి

అలా వాళ్ళు కొట్టుకుపోతున్న దశలో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అంటూ మరో బాంబు పేల్చింది బిజెపి. ఇక చర్చ మొత్తం దీని మీదకు మళ్ళింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతో సహా అందరూ ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటే, వచ్చే ఐదు రాష్ట్రాలతో సహా బీజేపీ ఎన్నికలకు వెళ్ళనుందా? పార్లమెంట్ ఎన్నికలు ముందే రాబోతున్నాయా? అలా వస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఇలాంటి ఊహాగానాల్లో మొత్తం దేశం కొట్టుకుపోయింది. ఇంతలో ఇంకో బాంబు పేల్చింది బిజెపి. అదేమిటంటే దేశం పేరు ఇండియా తొలగించి కేవలం భారత్ మాత్రమే ఉండాలని. ఇక ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటు దేశమంతా ఒకే దేశం ఒకే పేరు అనే చర్చల, వాదోపవాదాల్లో పడిపోయింది. సహజంగానే ప్రతిపక్షాలు కూడా అందులో కూరుకుపోయాయి. బిజెపి టైమింగ్ అంటే ఇదే.

జి20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 8న ఈ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరి విదేశాల ప్రముఖులు మన దేశం వస్తున్నప్పుడు దేశంలో మత ఘర్షణలు, జాతుల పోరాటాలు, నిరుద్యోగ సమస్యలు, అధిక ధరల ఆకలికేకల మంటలు.. ఇలాంటివి వినిపిస్తే ప్రపంచం ఏమనుకుంటుంది చెప్పండి? సో.. బిజెపి అత్యంత వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు ఎక్కుపెట్టే బాణాలను తమకు అనుకూలమైన అంబుల పొదిలో దూరి విశ్రాంతి తీసుకునేలా చేసింది. ఇటు దేశమంతా అటు ప్రతిపక్షాలు కలిసికట్టుగా బిజెపి వ్యూహామాయలో పడిపోవడమే కాదు, అటు ప్రపంచంలోని దేశాలు కూడా భారతదేశం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. అదేమంటే, కేవలం ఇండియా పేరు మారితే ఎలా అనేది.

ప్రపంచం ఆలోచన తాజాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ అధింకార ప్రతినిధి ఫర్హాన్ హక్ ఈ విషయంలో స్పందించిన వార్త వెలుగు చూసింది. గత ఏడాది టర్కీ కూడా తమ దేశం పేరు తుర్కియే అని మార్చుకుందని, ఒకవేళ ఇండియా నుంచి పేరు మార్పు ప్రతిపాదన తమకు వస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారట. ఇలా చెప్పాలంటే అనేక ఉదాహరణలు చూపొచ్చు. సెప్టెంబర్ 17 న హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ పెట్టే పెద్ద బహిరంగ సభ గురించి తెలుసు కదా. సరిగ్గా అదే రోజున అదే పెరేడ్ గ్రౌండ్స్ లో బిజెపి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూశారా, దటీజ్ బిజెపి టైమింగ్. దేశాన్ని, ప్రతిపక్షాలని, అటు ప్రపంచ దేశాలని కూడా తమవైపు మళ్లించుకున్న చాకచక్యం. అందుకే బిజెపి టైమింగ్ కి సెల్యూట్ చెప్పాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat
  • bjp
  • delhi
  • G20 summit 2023
  • india
  • pm modi

Related News

Extramarital Affairs

Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. వార్తల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఇలాంటి వారిని ఎంతో మందిని మనం గమనించే ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనస

  • Gold Mine

    Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!

  • Bharat Taxi

    Bharat Taxi: ఇక‌పై ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ.. ఎందుకంటే?

  • Pm Modi In Bihar

    PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!

  • Hdfc

    HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

Latest News

  • Coconut : దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కారణాలు ఇవీ

  • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

  • Rohit Sharma: ఆసీస్‌తో మూడో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ పేరిట న‌మోదైన రికార్డులీవే!

  • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

  • IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!

Trending News

    • Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

    • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

    • Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?

    • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

    • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd