Telangana : జీతాలు అందడంలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు మృతి
నాల్గు రోజుల క్రితం సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
- Author : Sudheer
Date : 08-09-2023 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ పక్క బంగారు తెలంగాణ (Telangana) అని చెప్పి..కేసీఆర్ (CM KCR) అంటుంటే..ప్రభుత్వ ఉద్యోగులు (Telangana Government Employees) మాత్రం ఇది బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ అని అంటున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న టైంకు జీతాలు (Government employees salary) ఇవ్వడం లేదని వారంతా వాపోతున్నారు. తాజాగా నాల్గు రోజుల క్రితం సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డ్ రవీందర్ (Home Guard Ravinder ) చికిత్స పొందుతూ ఈరోజు (DRDO Hospital) కన్నుమూశారు. ఈ ఘటన షాయినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మోర్చరీకి తరలించారు. ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య, పిల్లలు మనీశ్, కౌశిక్ ఉన్నారు.
Read Also : Tirumala Leopard Roaming : వామ్మో ఇంకో రెండు చిరుతలా..? హడలిపోతున్న వెంకన్న భక్తులు..
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Cabinet Minister Kishan Reddy) అన్నారు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్ ను ఆయన ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ… హోంగార్డు వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. అలాగే హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రతికూల పరిస్థితుల్లో వారు విధులు నిర్వర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో ప్రత్యేక అలవెన్సులు కూడా ఇవ్వాలని సూచించారు.