Ennore Oil Spill: ఎన్నూరులో ఆయిల్ బాధితులకు ప్రభుత్వం సాయం
ఎన్నూరులో చమురు వల్ల నష్టపోయిన కుటుంబాలకు, పడవలకు సాయం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ స్పిల్ బాధిత కుటుంబాలకు 12 వేల 500 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం అందించింది.
- Author : Praveen Aluthuru
Date : 17-12-2023 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
Ennore Oil Spill: ఎన్నూరులో చమురు వల్ల నష్టపోయిన కుటుంబాలకు, పడవలకు సాయం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ స్పిల్ బాధిత కుటుంబాలకు 12 వేల 500 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం అందించింది. చమురు కిందపడిపోవడం వల్ల నష్టపోయిన మత్స్యకారుల బోట్లకు 10,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించింది. చమురు చిందటం వల్ల ప్రభావితమైన 22 మత్స్యకార గ్రామాల్లోని 2,300 కుటుంబాలు మరియు 700 బోట్లకు ఉపశమనం లభిస్తుంది. సీపీసీఎల్ పెట్రోలియం కర్మాగారం నుంచి కారుతున్న చమురు కారణంగా ఎన్నూర్ సముద్రం, కొసస్తలై నది కిలోమీటర్ల మేర విస్తరించింది.
మిక్‌జామ్ తుఫాను చెన్నై సహా సహా చుట్టుప్రక్కల ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించింది. వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. దీని కోసం సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతుండగా, చమురు వ్యర్థాలు నదిలో కలిశాయి. స్థానిక మత్స్యకారుల పడవలకు నల్లటి జిగురులా చమురు అంటుకుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా చేపల పునరుత్పత్తికి ప్రధాన వనరుగా ఉన్న కొసస్తలై నదిలో చమురు చిందటం వల్ల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో తమ జీవనోపాధి కూడా దెబ్బతింటోందని వాపోయారు. తక్షణమే వ్యర్థాలను తొలగించాలని, ఆయిల్ స్పిల్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు తగిన సాయం అందించాలని మత్స్యకారులు నిరసన తెలిపారు. దీంతో సాయం అందిస్తామని హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
ఆయిల్ స్పిల్ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిని గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. జలవనరుల శాఖ నివేదిక ప్రకారం 5 కి.మీ మేర పెద్ద మొత్తంలో చమురు వ్యర్థాలు కనిపించాయి.
Also Read: Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. డిలీట్ చేసిన మెసేజ్ ను చదవండిలా?