Rana 3 Demands : ఎన్ఐఏ ఎదుట తహవ్వుర్ రాణా 3 డిమాండ్లు
పేపర్‌పై(Rana 3 Demands) అతడు ఏం రాస్తాడు అనేది పరిశీలించడానికి, రాణా గదిలో చుట్టూ కెమెరాల నిఘా ఉండనే ఉంది.
- By Pasha Published Date - 09:04 AM, Sun - 13 April 25

Rana 3 Demands : 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణాను ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా విచారణ క్రమంలో.. అతడు ఎన్ఐఏ అధికారుల ఎదుట మూడు డిమాండ్లు పెట్టాడట. తనకు ఖురాన్ ఇవ్వమని రాణా అడిగాడట. పెన్ను పేపర్ ఇవ్వమని చెప్పాడట. 26/11 ఉగ్రదాడి గురించి ఎదురు ప్రశ్న వేసే అవకాశాన్ని తనకు కల్పించమని రాణా కోరాడట. అతడి కోరిక మేరకు అధికారులు ఖురాన్ గ్రంథాన్ని రాణాకు ఇచ్చారట. దాన్ని అతడు రోజూ తన గదిలో కూర్చొని చదువుతున్నాడట. రాణా ఇక రోజూ ఐదు పూటలు నమాజ్ చేస్తున్నాడట. ఏదైనా రాసుకోవడానికి రాణా పెన్ను పేపర్ అడిగాడట. అయితే పెన్నుతో పొడుచుకొని సూసైడ్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ముందుజాగ్రత్త చర్యగా సాఫ్ట్ టిప్ కలిగిన పెన్‌ను అతడికి అధికారులు అందించారు. పేపర్‌పై(Rana 3 Demands) అతడు ఏం రాస్తాడు అనేది పరిశీలించడానికి, రాణా గదిలో చుట్టూ కెమెరాల నిఘా ఉండనే ఉంది.
Also Read :AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్ ?!
రాణా ఏం ప్రశ్నిస్తాడు ?
ఇక 26/11 దాడుల గురించి ఎన్ఐఏ అధికారులను రాణా ఏం అడుగుతాడు ? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. బహుశా ఈ ఘటనలో తన పాత్ర గురించి ఎన్ఐఏ అధికారులకు అతడు చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదంటే ఇంకా ఏదైనా విషయాన్ని బహిర్గతం చేస్తాడా అనేది కొన్ని రోజులు గడిస్తే కానీ తెలియదు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 18 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం తహవ్వుర్ రాణాను ఎన్ఐఏకు అప్పగించింది. ఈ 18 రోజుల్లో రాణా నోటి నుంచి ఎన్ఐఏ ఏయే విషయాలను కక్కిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ ఆర్మీ, గూఢచార సంస్థ ఐఎస్ఐలతోనూ రాణాకు సంబంధాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సీక్రెట్స్‌ను తెలుసుకునేందుకు భారత దర్యాప్తు సంస్థలు తప్పక ప్రయత్నాలు చేస్తాయి.