World Currency King : కాందహార్ హైజాక్ విమానంలో వరల్డ్ కరెన్సీ కింగ్.. ఏమైందో తెలుసా ?
ఒకవేళ గుర్తుపట్టి ఉంటే సీన్ మరోలా ఉండేదని తెలిసింది. ఇంతకీ ఆ కుబేరుడు(World Currency King) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Pasha Published Date - 11:55 AM, Wed - 11 September 24

World Currency King : కాందహార్ హైజాక్ ఘటన ఆధారంగా ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘IC 814’ మూవీ విడుదలైంది. ఈనేపథ్యంలో 1999 డిసెంబర్ 24న జరిగిన ‘IC 814’ విమానం హైజాక్ ఘటనపై అంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ విమానంలో కూర్చున్న ఓ వీఐపీ వ్యాపారవేత్తను ఉగ్రవాదులు గుర్తు పట్టలేదని.. ఒకవేళ గుర్తుపట్టి ఉంటే సీన్ మరోలా ఉండేదని తెలిసింది. ఇంతకీ ఆ కుబేరుడు(World Currency King) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :RS 419 Crores Awarded : తప్పుడు కేసులో శిక్ష అనుభవించినందుకు రూ.419 కోట్ల పరిహారం
రాబర్టో గియోరి.. ఈయన పేరు చాలామందికి తెలియదు. కానీ చాలా ఫేమస్. రాబర్టో గియోరి స్విస్-ఇటాలియన్ వ్యాపారవేత్త. ఈయన వ్యాపారం ఏమిటో తెలుసా ? ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్ల తయారీకి వినియోగించే చాలా వరకు మెటీరియల్‌ను రాబర్టో గియోరికి చెందిన కంపెనీ సప్లై చేస్తుంటుంది. రాబర్టో గియోరికి చెందిన కంపెనీ పేరు.. ‘డె లా ర్యూ’ (De La Rue) !! ఇది బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ప్రపంచంలో 90 శాతం కరెన్సీ ప్రింటింగ్ కోసం వినియోగించే మెటీరియల్‌ను ‘డె లా ర్యూ’ కంపెనీయే సప్లై చేస్తుంటుంది. హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్తున్న ‘IC 814’ విమానంలో రాబర్టో గియోరి ఉన్నారని హైజాకర్లు గుర్తించలేకపోయారు. దీంతో ఆయనకు పెనుముప్పు తప్పింది. స్విట్జర్లాండ్‌లోనే అత్యంత ధనికుడైన రాబర్టో గియోరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటే పరిణామాలు మరోలా ఉండేవి. ఈమేరకు వివరాలతో 2000 సంవత్సరంలోనే టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది.
Also Read :Pak Violates Ceasefire : పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్‌కు గాయాలు.. భారత్ ప్రతిఘటన
అప్పట్లో కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు పెట్టిన షరతులను అంగీకరించేలా ఇతర దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి వచ్చింది. దీనికి కారణం ఆ విమానంలో రాబర్టో గియోరి ఉండటమే అని అప్పట్లో టైమ్స్ పత్రిక కథనంలో ప్రస్తావించారు. ఆ సమయంలో రాబర్టో గియోరి కోసం స్విట్జర్లాండ్ దేశం ప్రత్యేక టీమ్‌ను కాందహార్‌కు పంపింది. అప్పట్లో హైజాకర్లు 200 మిలియన్ డాలర్ల నగదును డిమాండ్ చేశారు. ఒకవేళ కిడ్నాప్ అయిన వారిలో రాబర్టో గియోరి కూడా ఉన్నారని తెలిస్తే.. వాళ్లు మరింత ఎక్కువ మొత్తాన్ని అడిగి ఉండేవాళ్లని ఆనాడు టైమ్స్ పత్రిక కథనంలో విశ్లేషించారు.