Suresh Gopi : మంత్రి పదవి వదులుకుంటానని తెలిపిన సురేష్ గోపి..కారణం అదేనట..!!
నేను చాలా సినిమాలకు సైన్ చేశాను, వాటిని చేయాల్సి ఉంది.. మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేయలేను..కానీ త్రిసూర్ ఎంపీగా పని చేస్తాను
- By Sudheer Published Date - 02:01 PM, Mon - 10 June 24

దేశంలో కొత్త కేంద్ర వర్గం ఏర్పడింది. నిన్న ఆదివారం ప్రధానమంత్రి మోడీ తో సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వీరిలో 33మందికి తొలిసారిగా చోటు దక్కింది. అందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఎడుగురు బీజేపీ మిత్ర పక్షాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో కేరళ నుండి సురేష్ గోపి (Suresh Gopi) ఒకరు. తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha election) విజయం సాధించి దేశంలోనే మొట్ట మొదటి సారిగా కేరళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా పార్టమెంట్‌లో అడుగుపెట్టాడు. నిన్న రాష్ట్ర పతి చేత గోపి కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గ ప్రజల్లో , అభిమానుల్లో సంతోషం నింపారు. కానీ అంతలోనే షాకింగ్ నిర్ణయాన్ని తెలిపి షాక్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రమాణ స్వీకారం అనంతరం ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. త్వరలోనే ఆ పదవి నుంచి రిలీవ్ అవుతానని.. తాను మంత్రి పదవి అడగలేదని సురేష్ గోపి చెప్పుకొచ్చారు. ‘నేను చాలా సినిమాలకు సైన్ చేశాను, వాటిని చేయాల్సి ఉంది.. మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేయలేను..కానీ త్రిసూర్ ఎంపీగా పని చేస్తాను. కేవలం ఎంపీగా తన నియోజకవర్గానికి పని చేయాలని అనుకుంటున్నానని, తనకు మంత్రి పదవి అవసరం లేదని సురేష్ గోపి స్పష్టం చేసారు. ఇక సురేష్ గోపి త్రిసూర్ నుండి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించి చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నారు. ఈ స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పోటీ చేసిన వీఎస్ సునీల్ కుమార్ 74,686 ఓట్ల తేడాతో సురేష్ గోపీ చేతిలో ఓడిపోయారు. 2016లో ఫస్ట్ టైం రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేయబడిన సురేష్ గోపి ఆ తర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమై ఓటమి చెందారు. ఆ వెంటనే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి సంచలనం సృష్టించారు.
Read Also : CM Convoy Attacked : మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలు