HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Supreme Court Halts Temple Beneath Mosque Surveys

Mosque Surveys : మసీదుల సర్వేకు ఆదేశాలివ్వొద్దు.. కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ భారత సుప్రీంకోర్టు(Mosque Surveys) కీలక ఆదేశాలు జారీ చేసింది.

  • By Pasha Published Date - 05:49 PM, Thu - 12 December 24
  • daily-hunt
Supreme Court Mosque Surveys Places Of Worship Act

Mosque Surveys :  అజ్మీర్ దర్గాలో శివాలయం ఉందని ఆరోపిస్తూ ఇటీవలే ఒక పిటిషన్ దాఖలైంది..  అజ్మీర్ దర్గాను సర్వే చేయించాలని సదరు పిటిషనర్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదులో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఈ సర్వేను అక్కడి ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ వర్గం ప్రజలు, పోలీసుల మధ్య  భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. తదనంతరం భారీ భద్రత నడుమ అధికారులు సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ భారత సుప్రీంకోర్టు(Mosque Surveys) కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు వాదనలు విన్నది.

Also Read :WhatsApp Translator : ‘వాట్సాప్‌ ట్రాన్స్‌లేటర్’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాల ఉనికిని ఎవరూ సవాల్ చేయకూడదని ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ చెబుతోంది. అయితే ఈ చట్టం వల్ల హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ప్రాచీన ప్రార్థనా స్థలాలను తిరిగి సాధించుకునే హక్కుకు భంగం కలుగుతుందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రస్తుతం తాము ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’లోని లక్ష్యాలు, ఉద్దేశాలపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ వెల్లడించింది. హిందూ ఆలయాలపై నిర్మించారనే అభియోగాలతో మసీదులను సర్వే చేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్లు, ఇకపై దాఖలయ్యే పిటిషన్ల విషయంలో నిగ్రహం పాటించాలని కోర్టులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ తరహా పిటిషన్లపై తొందరపాటు వైఖరితో ఎలాంటి ఆదేశాలనూ ఇవ్వకూడదని పేర్కొంది. ఈ పిటిషన్ల ఆధారంగా మసీదుల సర్వేలకు కానీ, ఇతరత్రా చర్యలకు కానీ ఆర్డర్స్ జారీ చేయొద్దని కోర్టులకు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర సర్కారుకు నిర్దేశించింది. కేంద్రం స్పందనను తెలియజేసిన నాలుగు వారాల్లోగా ముస్లిం సంస్థలు సహా ఇతర పక్షాలు స్పందనలను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది.

Also Read :Mark Zuckerberg : ట్రంప్‌కు రూ.8వేల కోట్లు ఇచ్చుకున్న ఫేస్‌బుక్ అధినేత.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mosque surveys
  • Places of Worship Act
  • Supreme Court

Related News

    Latest News

    • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

    • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

    • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

    • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

    • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

    Trending News

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd