Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో గురువారం హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- By Gopichand Published Date - 06:25 AM, Fri - 10 February 23

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో గురువారం హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్‌లోని కోరార్ గ్రామంలోని చిల్హతి చౌక్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది పాఠశాల విద్యార్థులు మరణించారు. ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
పాఠశాలకు ముగించుకుని పిల్లలంతా ఆటోలో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. చిల్హతి చౌక్ సమీపంలో అతివేగంతో వస్తున్న ట్రక్కు ముందు నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటో విడిభాగాలు ఊడిపోవడంతో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో ప్రమాదంలో గాయపడిన 4 మంది పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మరో ఇద్దరు పిల్లలు మరణించారు.
Also Read: Cryopreservation: మళ్ళీ బ్రతికిస్తాం.. చనిపోయిన వారిని అలా చేయడమా?
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ కోరుర్‌లోని ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం చిన్నారుల బంధువులు రోదనలు మిన్నంటాయి. గాయపడిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన పిల్లలిద్దరినీ మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కంకేర్ జిల్లాలోని కోరేర్ చిల్హతి చౌక్ వద్ద ఆటో, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 7 మంది పాఠశాల విద్యార్థులు ఆకస్మికంగా మరణించిన వార్త చాలా బాధాకరమని ఆయన రాశారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆరోగ్య శాఖ ద్వారా సాధ్యమైన అన్ని సహాయం అందిస్తోంది. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.