Junagadh: జునాగఢ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై 300 మంది దాడి.. వీడియో వైరల్..!
శుక్రవారం రాత్రి (జూన్ 16) గుజరాత్‌లోని జునాగఢ్ (Junagadh)లో వందలాది మంది గుంపు అక్రమ దర్గాపై వీరంగం సృష్టించింది.
- Author : Gopichand
Date : 17-06-2023 - 11:52 IST
Published By : Hashtagu Telugu Desk
Junagadh: శుక్రవారం రాత్రి (జూన్ 16) గుజరాత్‌లోని జునాగఢ్ (Junagadh)లో వందలాది మంది గుంపు అక్రమ దర్గాపై వీరంగం సృష్టించింది. అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా పరిపాలన నోటీసు ఇచ్చిన తర్వాత గుంపు రాళ్లు రువ్వి పోలీసు పోస్ట్‌పై దాడి చేసింది. ఈ దాడిలో డిప్యూటీ ఎస్పీ, మహిళా పీఎస్‌ఐ, ఒక పోలీసు గాయపడ్డారు. అంతేకాకుండా ఆగ్రహించిన గుంపు పలు వాహనాలను తగులబెట్టింది. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. అయితే ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా, 174 మందిని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
— ANI (@ANI) June 17, 2023
అసలు విషయం ఏమిటి..?
జునాగఢ్‌లోని ఉపర్‌కోట్ ఎక్స్‌టెన్షన్‌లో దర్గాకు సంబంధించి అక్రమ నిర్మాణంపై పరిపాలన నోటీసు ఇచ్చింది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. గురు, శుక్రవారాల మధ్య రాత్రి ఈ కోపాన్ని అదుపు చేసుకోలేక జునాగఢ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. తొలగించాలని నోటీసు ఇచ్చిన దర్గా మాజేవాడి గేటుకు ఎదురుగా ఉంది. ఐదు రోజుల గడువు ముగిసినప్పటికీ నోటీసుకు సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత చర్య తీసుకోవాలని పరిపాలన నిర్ణయించింది.
Also Read: Uganda: పాఠశాలపై ఉగ్రవాదులు దాడి.. 25 మంది మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం
సమాచారం ప్రకారం.. జునాగఢ్‌లోని మజేవాడి గేట్ వద్ద ఉన్న దర్గాకు 5 రోజుల్లో పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చింది. ముందురోజు నోటీసును వ్యతిరేకిస్తూ దాదాపు 600 మంది అక్కడ గుమిగూడారు. రోడ్డును అడ్డుకోవద్దని పోలీసులు వారిని ఒప్పించేందుకు ప్రయత్నించగా రాత్రి 10 గంటల సమయంలో గుంపు పోలీసులపై రాళ్లు రువ్వింది. పోలీసులపై కూడా యాసిడ్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు.
శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ బృందం కూల్చివేత నోటీసు ఇవ్వడానికి చేరుకుంది. దీనికి వ్యతిరేకంగా జనం గుమిగూడారు. కొద్దిసేపటికే ఈ గుంపు దుండగులుగా మారి పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఈ రచ్చ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో 200-300 మంది గుంపు రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం కనిపిస్తుంది. హింస చెలరేగడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు.