Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. ఉపాధ్యాయులకు సౌరబ్ గంగూలీ విజ్ఞప్తి
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నివాసానికి ఉపాధ్యాయులు వెళ్లారు. తాము చేపట్టే నిరసన ప్రదర్శనలో పాల్గొని మాకు న్యాయం జరిగేలా మద్దతు ఇవ్వాలని కోరారు.
- By News Desk Published Date - 11:09 PM, Fri - 18 April 25

Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ పాఠశాల సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్‌సీ) నియామకాల కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో.. పశ్చిమ బెంగాల్ స్కూల్ సెలెక్షన్ కమిషన్ జారీ చేసిన 2016 నాటి నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన 25,753 మంది బోధన, భోధనేతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కొత్తవారిని భర్తీ చేయడానికి సమయం పడుతుందని, ఈ క్రమంలో బోధనపై ప్రభావం పడుతుందని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ దరఖాస్తును పరిశీలించిన సీజేఐ జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు విధుల్లో కొనసాగొచ్చని పేర్కొంది. విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.ఉపాధ్యాయులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తమను శాశ్వతంగా విధుల్లోకి తీసుకుంటేనే
Also Read: MMTS రైలులో అత్యాచారయత్నం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎవరు చెప్పేది నిజం..?
ఉపాధ్యాయులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తమను శాశ్వతంగా విధుల్లోకి తీసుకుంటేనే న్యాయం జరిగినట్లని పేర్కొన్నారు. ఏప్రిల్ 21న పశ్చిమ బెంగాల్ సచివాలయం వరకు నిరసన ప్రదర్శ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తమ నిరసనకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నివాసానికి ఉపాధ్యాయులు వెళ్లారు. తాము చేపట్టే నిరసన ప్రదర్శనలో పాల్గొని మాకు న్యాయం జరిగేలా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ వారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
ఉపాధ్యాయుల ఆహ్వానాన్ని గంగూలీ సున్నితంగా నిరాకరించారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. ఇది తనకు ఏవిధంగానూ సంబంధం లేని అంశం అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.