HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Something Amiss Can Not Be Peoples Verdict Sanjay Raut On Maharashtra Results

Maharashtra Elections 2024: ‘‘ఏదో గడ్బడ్ చేశారు.. ఇది ప్రజాతీర్పు కాదు’’.. ‘మహా’ ఫలితాలపై సంజయ్ రౌత్

ఇది ప్రజా నిర్ణయం(Maharashtra Elections 2024) కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

  • By Pasha Published Date - 12:26 PM, Sat - 23 November 24
  • daily-hunt
Maharashtra Elections 2024 Sanjay Raut On Maharashtra Election Results

Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని  మహాయుతి కూటమి దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ వార్త ప్రచురితం అయ్యే సమయానికి ఎన్డీయే కూటమి 223 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఎక్కువ సీట్లలోనే మహాయుతి కూటమి హవా వీస్తోంది. మహావికాస్‌ అఘాడీ కూటమి కేవలం 57 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈవిధంగా ఏకపక్షంగా వస్తున్న ఫలితాలపై  శివసేన (ఉద్ధవ్ థాక్రే) పార్టీ నేత సంజయ్ రౌత్  అనుమానం వ్యక్తంచేశారు. ఇది ప్రజా  తీర్పు(Maharashtra Elections 2024) కాదని ఆయన వ్యాఖ్యానించారు.  ఏవైనా అవకతవకలు జరిగి ఉండొచ్చని ఆరోపించారు.

Also Read :AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ముందున్నది ఎవరు అంటే.. ?

‘‘మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి రావాల్సిన సీట్లను కాజేసేందుకు వాళ్లు (మహాయుతి కూటమి) ఏదో గడ్బడ్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే అదే భావన కలుగుతోంది. ఇది ప్రజల తీర్పులా కనిపించడం లేదు. ప్రజలు కూడా ఈ ఫలితాలతో ఏకీభవించరు’’ అని సంజయ్ రౌత్  వ్యాఖ్యానించారు. ‘‘ఏక్‌‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీకి 60 సీట్లు రావడం సాధ్యమయ్యే విషయమేనా ? అజిత్ పవార్‌కు 40 సీట్లు సాధించే సీన్ ఉందా ? బీజేపీకి 125 సీట్లు గెలిచే దమ్ముందా ?’’ అని ఆయన ప్రశ్నలు సంధించారు. ‘‘నాకు  నమ్మకం ఉంది. మహారాష్ట్ర ప్రజలు నిజాయితీపరులు.. వాళ్లు ఇలాంటి తీర్పులు ఇవ్వరు’’ అని సంజయ్ కామెంట్ చేశారు.  ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ మండిపడ్డారు. ప్రజలు నమ్మకంతో మళ్లీ మహాయుతి కూటమికే అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజల తీర్పుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సంజయ్‌కు సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారంతో మహారాష్ట్ర పురోగమిస్తోందని, దీన్ని ప్రజలు గుర్తించారని ఆయన చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే మహారాష్ట్ర పురోగతి సాధ్యమని రాష్ట్ర ప్రజలు గుర్తించారని ప్రవీణ్ దరేకర్ తెలిపారు.

Also Read :Kalvakuntla Kavitha : ‘తెలంగాణ జాగృతి’తో కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్.. వాట్స్ నెక్ట్స్ ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Maharashtra
  • Maharashtra Election Results
  • Maharashtra Elections 2024
  • Maharashtra Results
  • nda
  • sanjay raut

Related News

Rep And Murder

Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

Maharashtra : పాలఘర్ జిల్లాకు చెందిన నీలేశ్ ధోంగ్డా అనే యువకుడి వివాహ నిశ్చితార్థం బిబల్దార్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగింది

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

  • Bjp

    BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్

  • Cbi Kcr

    CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd