HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sixteen Thousand Medicos Yet To Return From Ukrain

Ukraine Medicos: ఉక్రెయిన్ నుంచి ఇంకా రావాల్సి ఉన్న 16 వేల మంది మెడికోలు

  • Author : hashtagu Date : 02-03-2022 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
8899
8899

ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భార‌తీయ వైద్య విద్యార్థులను సుర‌క్షితంగా తిరిగి తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయ‌త్నాలు చేస్తోంది. ఆప‌రేష‌న్ గంగ పేరుతో ప్రత్యేకంగా విమానాలు న‌డుపుతూ వారిని స్వస్థలాల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేసింది. రాజ‌ధాని కీవ్ నుంచి అంద‌ర్నీ త‌ర‌లించింది. ప్రస్తుతం అక్కడ వైద్య విద్యార్థులు స‌హా భార‌తీయులు ఎవ‌రూ లేరు. దాంతో రాయ‌బార కార్యాల‌యంలోని అధికారులు, సిబ్బంది కూడా ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లారు.

అంద‌రూ బోర్డర్లకు వ‌స్తే, అక్కడ నుంచి స‌రిహ‌ద్దుల్లోని దేశాల‌కు తీసుకువెళ్లి, అక్కడ నుంచి విమానాల ద్వారా భార‌త్ కు పంపిస్తామ‌ని అధికారులు విద్యార్థుల‌కు మెసేజ్‌లు పంపించారు.అక్కడ ఇంకా 16వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారి కోసం రానున్న మూడు రోజుల్లో 26 విమానాలు న‌డిపే అవ‌కాశం ఉంది. స‌రిహ‌ద్ధుల‌కు చేరుకోవ‌డం మెడికోల‌కు క‌ష్టంగా మారింది. రైళ్లను ఎక్కనీయ‌డం లేద‌ని, ఎక్కకుండా కొడుతున్నార‌ని కూడా స‌మాచారం.

రైల్వే స్టేష‌న్లు, బంక‌ర్లు, బోర్డర్ పోస్టుల్లో భ‌యం భ‌యంగా కాలం గ‌డుపున్నారు. సామాన్య ప్రజ‌లు నివ‌సించే ప్రాంత‌ల‌పైనా ర‌ష్యా బాంబులు వేస్తుండ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు ఏమాత్రం లేవు. దాంతో ఆహారం, మంచినీరు కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌ష్ట కాలంలో ఒక‌రికొక‌రు అండ‌గా ఉంటూ ధైర్యం చెప్పుకొంటున్నారు. అలాంటి ప్రయ‌త్నంలోనే క‌ర్ణాట‌క విద్యార్థి న‌వీన్ క‌న్నుమూశాడు.

జూనియ‌ర్లకు అండ‌గా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ముందుగా కాకుండా చివ‌ర‌గా వెళ్లాల‌ని అనుకున్నాడు. ఆరు రోజుల పాటు బంక‌ర్‌లో ఉండి, ఆహారం కోసం బ‌య‌ట‌కు వ‌చ్చి బాంబు దాడిలో ప్రాణాలు వ‌దిలాడు. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. రాయబారులతో మాట్లాడింది. అందుకే ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను త్వరగా తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian medical students
  • Russia-Ukraine War
  • ukraine

Related News

Russia Ukraine War

ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు

Russia Vs Ukraine War  యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్‌ దాడి జరిపింది. ఈ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా గని కార్మికులేనని అధికారులు గుర్తించారు. దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్‌లో అతిపెద్ద విద్యుత్‌

  • Scott Bessent

    భారత్‌తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. యూరప్‌ పై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా

Latest News

  • వైరల్ : బస్సుల్లోనే కాదు రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు

  • శంబాలా కు ఓటీటీలో భారీ ఆదరణ.. 11 రోజుల్లోనే సరికొత్త రికార్డు!

  • చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

  • భారీగా పడిపోయాయి టమాటా ధరలు

  • TVK విజయ్ ఆ ట్రాప్‌లో మునిగిపోయాడా? ఇది ఆయన రాజకీయ భవిష్యత్ కు ప్రమాదమా ?

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd