SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్‌లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.
- By Praveen Aluthuru Published Date - 01:46 PM, Mon - 6 May 24

SIT Launches Helpline: హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్. నిజానికి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బాధితులు తమను సంప్రదించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రవేశ పెట్టింది.
బాధితులు 6360938947కు ఫోన్ చేయవచ్చని సిట్ చీఫ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీకే సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు సిట్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, వారికి సహాయం అందించడానికి బృందం వారిని వ్యక్తిగతంగా సంప్రదిస్తుందని సింగ్ చెప్పారు. ఇదిలావుండగా రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో లేదా వ్యక్తిగత మెసెంజర్ అప్లికేషన్‌లలో షేర్ చేయవద్దని సిట్ ప్రజలను హెచ్చరించింది. “మెసెంజర్ లలో ఈ వీడియోలను షేర్ చేస్తున్న వ్యక్తులను గుర్తించడం చాలా సులభం, కాబట్టి అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోబడతాయి అని సింగ్ చెప్పారు. ఇలాంటి వీడియోలను షేర్ చేయడం వల్ల బాధితుల పరువు, గౌరవం దెబ్బతింటాయని అన్నారు.
We’re now on WhatsApp : Click to Join
ప్రజ్వల్ మళ్లీ హాసన్ నుండి జీడీఎస్, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీకి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. జేడీ(ఎస్) గతేడాది సెప్టెంబర్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది.ప్రజ్వల్ ఏప్రిల్ 27 న దేశం విడిచిపెట్టినట్లు సమాచారం. అతనిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయబడింది. ప్రజ్వల్‌పై అత్యాచారం, వేధింపుల కేసులు నమోదయ్యాయి. మరోవైపు, 33 ఏళ్ల ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళను కిడ్నాప్ చేసినందుకు అతని తండ్రి మరియు ఎమ్మెల్యే హెచ్‌డి రేవన్నను అరెస్టు చేసి పోలీసు కస్టడీకి పంపారు.
Also Read: DK Shivakumar : కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్..