HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Senior Rss Leader Ram Madhav Will Be Announced As The New Chief Of The Bjp Soon

New BJP Chief: రామ్ మాధవ్‌కు బీజేపీ చీఫ్ పదవి ? కారణాలు బలమైనవే !

అందుకే ఆర్ఎస్ఎస్ మనిషిగా పేరొందిన రామ్ మాధవ్‌(New BJP Chief)కు బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

  • By Pasha Published Date - 01:58 PM, Sat - 5 April 25
  • daily-hunt
New Bjp Chief Ram Madhav Rss Leader Pm Modi Andhra Pradesh

New BJP Chief:  బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై తాజాగా పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రస్తావన వచ్చింది. కనీసం జాతీయ అధ్యక్షుడిని కూడా వేగంగా ఎంపిక చేసుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఉందని పలువురు విపక్ష నేతలు లోక్‌సభ, రాజ్యసభ వేదికగా విమర్శించారు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ జాప్యం చేస్తోందని తెలుస్తోంది. సమర్ధుడైన బీజేపీ చీఫ్ ఎంపిక కోసం కనీస సమయం అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని లీడ్ చేయబోయే నాయకుడికి కనీసం ఐదారు రాష్ట్రాల రాజకీయాలపై మంచి అవగాహన ఉండాలని కోరుకుంటున్నారట. ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా బీజేపీని బలోపేతం చేసే చతురత ఉన్న నేతకే పార్టీ పగ్గాలను అప్పగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారట. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా సన్నిహితులు కావడం వారణాసి రామ్ మాధవ్‌కు ప్లస్ పాయింట్.

Also Read :Microsoft 50th Anniversary : మైక్రోసాఫ్ట్‌కు 50 వసంతాలు.. బిల్‌గేట్స్ సమక్షంలో ఉద్యోగుల నిరసన.. ఎందుకు ?

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ సందర్శన వేళ.. 

ఇటీవలే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఆ పర్యటన సందర్భంగా సైతం నూతన బీజేపీ చీఫ్ ఎంపికపై.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో మోడీ చర్చించారట. మోహన్ భగవత్‌కు సన్నిహితుడైన బీజేపీ సీనియర్ నేత  వారణాసి రామ్ మాధవ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం మొదలైంది.

Also Read :Secret Island : భారత్‌కు చేరువలో అమెరికా – బ్రిటన్ సీక్రెట్ దీవి.. ఎందుకు ?

రామ్ మాధవ్‌ అంచెలంచెలుగా.. 

రామ్ మాధవ్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో  1964 ఆగస్టు 22న జన్మించారు. కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటీలో ఆయన  పొలిటికల్ సైన్సులో పీజీ చేశారు. రామ్ మాధవ్‌ 1981లో  ఆర్ఎస్ఎస్ లో చేరారు. 2014లో బీజేపీలో చేరారు.  ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. 2014లో జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ- పీడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. 2024లో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 29 సీట్లు రావడానికి ఆయనే ప్రధాన కారకులు.

ఆర్ఎస్ఎస్ మనిషికే పట్టం 

తాజాగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాల వెనక ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధమైన పనితీరు ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ మనిషిగా పేరొందిన రామ్ మాధవ్‌(New BJP Chief)కు బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మరో ఐదు నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. నూతన బీజేపీ చీఫ్ వచ్చాక.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన జరగనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bjp
  • BJP Chief
  • New BJP chief
  • pm modi
  • Ram Madhav
  • rss
  • RSS Leader

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

Trending News

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd