Yogi Adityanath: ‘‘ఇస్లాం పుట్టక ముందే ‘సంభాల్’.. 1526లో ఆలయాన్ని కూల్చేశారు’’
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తప్పుపట్టారు.
- By Pasha Published Date - 04:28 PM, Wed - 12 March 25

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంభాల్ పట్టణంలోని జామా మసీదు వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ ఆయన పలు పరోక్ష కామెంట్స్ చేశారు. ‘‘ఇస్లాం పుట్టకముందే సంభాల్ ఉంది. ఆ పట్టణానికి 5వేల ఏళ్ల చరిత్ర ఉంది. సంభాల్‌లో ఉన్న హరి విష్ణు ఆలయాన్ని 1526లో ధ్వంసం చేశారు. ఈవిషయాన్ని పలు గ్రంథాల్లో ప్రస్తావించారు. చారిత్రక సత్యానికి ప్రతీక సంభాల్. నేను దీని గురించి అనేకసార్లు బహిరంగంగానే చెప్పాను’’ అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.
जब अवसर मिलता है तो चूकना नहीं चाहिए…
इस बार हमने बजट में मथुरा-वृंदावन के लिए पर्याप्त पैसा दिया है…
और एक दिन पूरी दुनिया ‘भगवा’ पहनेगी… pic.twitter.com/2YVBisO11R
— Yogi Adityanath (@myogiadityanath) March 12, 2025
Also Read :Vijayasai Reddy : వాళ్ల వల్లే నాకు, జగన్‌కు విభేదాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సంభాల్‌లో 68 యాత్రా ప్రాంతాలు
ఇవాళ(బుధవారం) లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘సంభాల్‌లో 68 యాత్రా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 18 ప్రాంతాలను మాత్రమే గుర్తించాం. సంభాల్‌లో శివాలయానికి 56 ఏళ్ల తర్వాత జలాభిషేకం చేశాం’’ అని యోగి వెల్లడించారు. ‘‘సనాతన ధర్మాన్ని చూసి మేం గర్విస్తున్నాం. యావత్ ప్రపంచం ఒకనాటికి సనాతన ధర్మాన్ని అక్కున చేర్చుకుంటుంది. నేను ఒక యోగిని. అన్ని మతాలను గౌరవిస్తాను. కానీ ఒకరి ఆరాధనా స్థలాన్ని మరొకరు బలవంతంగా ఆక్రమించుకోవడం, ఇతరుల విశ్వాసాలను ధ్వంసం చేయడాన్ని సహించను’’ అని సీఎం యోగి పేర్కొన్నారు.
Also Read :Yogi Adityanath: నేపాల్ పాలిటిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి
తొలి కుంభమేళాపై ఏమన్నారంటే..
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తప్పుపట్టారు. మంచిని వ్యతిరేకించడం, విమర్శించడం అనేది కాంగ్రెస్ వాళ్లకు అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో, యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో (1954లో) తొలి కుంభమేళా జరిగిందని యోగి గుర్తు చేశారు. అప్పట్లో 100 మందికిపైగా భక్తులు చనిపోయారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ప్రతి కుంభమేళాలోనూ మరణాలు సంభవించడం కొనసాగుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కుంభ మేళాల నిర్వహణలో అవినీతి, అరాచకాలు జరిగాయని యోగి ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి అనేది, దాస్తే దాగే విషయం కాదన్నారు.