Train Accident : గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన 4 బోగీలు
Train Accident : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
- Author : Pasha
Date : 18-03-2024 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
Train Accident : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్ స్టేషన్ సమీపంలో ఉన్న గూడ్స్ రైలును.. వెనుక నుంచి వచ్చిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఫలితంగా సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించామని నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ వెల్లడించారు. అజ్మీర్ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, వారి బంధువులు సమాచారం కోసం 0145-2429642 హెల్ప్‌లైన్ నంబర్(Train Accident)కు కాల్ చేయాలని కోరారు.
#WATCH | Rajasthan: Four coaches including the engine of a passenger train travelling from Sabarmati-Agra Cantt derailed near Ajmer. Further details awaited. pic.twitter.com/fX9VeLKw2e
— ANI (@ANI) March 18, 2024
We’re now on WhatsApp. Click to Join
సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారిని వెంటనే అజ్మీర్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదం నేపథ్యంలో ఈ రూట్‌లో ఆరు రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను వేరే మార్గాల మీదుగా మళ్లించారు. 12065 అజ్మేర్- దిల్లీ-సరాయ్ రోహిల్లా, 22987 అజ్మేర్- ఆగ్రా ఫోర్ట్, 09605 అజ్మేర్-గంగాపూర్ సిటీ, 09639 అజ్మేర్-రేవాడ్, 19735 జైపుర్ – మార్వార్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 12915 సబర్మతి – దిల్లీ రైలు, 17020 హైదరాబాద్-హిసార్ రైళ్లను వేరే మార్గాల ద్వారా మళ్లించింది.