PM Modi : డిజిటల్ వరల్డ్ కోసం నియమనిబంధనలు : ప్రధాని మోడీ
PM Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎథికల్‌గా వాడే అంశంపై కూడా వర్కౌట్ చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 6జీ ఏర్పాటు కోసం కూడా పనులు మొదలైనట్లు తెలిపారు.
- By Latha Suma Published Date - 01:36 PM, Tue - 15 October 24

International Telecommunication Union Conference : ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సదస్సులో ఈరోజు ప్రధాని మోడీ మాట్లాడుతూ..టెలికాంతో పాటు దాని సంబంధిత టెక్నాలజీలో భారత్ మేటి దేశంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. భారత్‌లో 120 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారని, 95 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం రియల్ టైం డిజిటల్ లావాదేవీలు భారత్‌లో జరుగుతున్నట్లు మోడీ చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ చాలా కీలకమైన టూల్‌గా మారినట్లు తెలిపారు. గ్లోబల్ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌కు చెందిన రూల్స్‌ను రూపొందించాలని ప్రధాని మోడీ కోరారు.
టెక్నాలజీని సామరస్యపూర్వకంగా వాడేందుకు ఏం చేయాలి, ఏం చేయవద్దో అన్న అంశాలపై రూల్స్‌ను ఫ్రేమ్ చేయాలని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల కోసం ఏవియేషన్ రంగం ఎలాంటి రూల్స్‌ను రూపొందించిందో.. అలాగే డిజిటల్ వరల్డ్ కోసం నియమనిబంధనలు తయారు చేయాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో గ్లోబల్ సంస్థలు ఒక్కటి కావాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎథికల్‌గా వాడే అంశంపై కూడా వర్కౌట్ చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 6జీ ఏర్పాటు కోసం కూడా పనులు మొదలైనట్లు తెలిపారు.
గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ వేశారని, అయితే చంద్రుడు, భూమి మధ్య ఉన్న దూరం కన్నా.. 8 రెట్లు అధికంగా ఆప్టికల్ ఫైబర్‌ను దేశవ్యాప్తంగా పరిచినట్లు ప్రధాని మోడీ తెలిపారు. గ్లోబల్ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ఆయన కోరారు. రెండేళ్ల క్రితం మొబైల్ కాంగ్రెస్ సమావేశాల్లో 5జీని ఆవిష్కరించినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ 5జీ సేవలు విస్తరించినట్లు ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ 5జీ మార్కెట్‌గా ఇండియా నిలిచినట్లు చెప్పారు. 6జీ కోసం కూడా వేగంగా పనులు జరుగుతున్నట్లు తెలిపారు.