Indian Railways: రైళ్లలో ఆ సేవలు షురూ
కోవిడ్ నేపథ్యంలో మొదటిసారిగా ఇండియన్ రైల్వే తన సేవలను ఆపేసింది.
- By Hashtag U Published Date - 11:27 PM, Fri - 19 November 21

కోవిడ్ నేపథ్యంలో మొదటిసారిగా ఇండియన్ రైల్వే తన సేవలను ఆపేసింది. కరోనా కేసులు తగ్గుతున్నకొద్దీ రైల్వే శాఖ తన సేవలను ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకుంటూ వస్తోంది. రైలులో వండిన ఆహారపదర్థాలను ప్రయాణికులకు అందించే సదుపాయాన్ని కూడా త్వరలోనే రీలాంచ్ చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
కరోనా తర్వాత ప్రస్తుతం రాజధాని, శతాబ్ది లాంటి రైళ్లలోనే ప్యాక్ చేసిన ఆహారం లభిస్తోందని, తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో కరోనా ముందు ఏయే రైళ్లల్లో ఏయే సదుపాయాలు లభించాయో మళ్ళీ అలాంటి సదుపాయాలు మొదలవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుండి మళ్ళీ రైళ్లల్లో ప్రయాణికులకు వండిన ఆహారం అందుబాటులోకి రానుంది.
Also Read: జగన్ విషయంలో ఎంత బాధపడ్డానో, చంద్రబాబు విషయంలో అంతే బాధపడుతున్నానన్న పవన్ కళ్యాణ్
కరోనా ముందటి రైల్వే క్యాంటిన్ టెండర్లు రద్దయ్యాయని, త్వరలోనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ కార్పొరేషన్ ఫుడ్ లైసెన్స్ కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు సమాచారం. గతంలో రైళ్లలో లభించే ఆహార పదార్థాలతో ప్రయాణికులు సంతృప్తిగా లేరని నూతన టెండర్లు పొందిన వారితో మెనూ విషయంలో మార్పులపై చర్చిస్తామని అధికారులు తెలిపారు.
Also Read: విధిరాత.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు శపథం
కరోనా కంటే ముందు రైల్వే శాఖలో రోజుకి 11 లక్షల మీల్స్ అమ్ముడు పోయేవని, ప్రస్తుతం ప్రయాణికులకు ఇచ్చే ఆహారపదార్థాలలో మార్పులు తెస్తే ఇంకా ఎక్కువ మీల్స్ అవసరంపడొచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.
Related News

Increases Ex Gratia: ఎక్స్‌గ్రేషియా 10 రెట్లు పెంచిన భారతీయ రైల్వే బోర్డు..!
రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా చెల్లించే ఎక్స్‌గ్రేషియా (Increases Ex Gratia) మొత్తాన్ని భారతీయ రైల్వే బోర్డు 10 రెట్లు పెంచింది. ఈ మొత్తాన్ని చివరిగా 2012- 2013లో సవరించారు.