HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rahul Gandhi Fire On China Row

Rahul Gandhi: చైనా రాయబారి ఘటన తరువాత.. చైనాపై రాహుల్ వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా కాలం తరువాత చైనా అంశాన్ని ప్రస్తావించారు. మొన్నామధ్య నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో చైనా రాయబారితో మాటలు కలిపారన్న విమర్శలు గుప్పుమన్నాయి.

  • Author : Hashtag U Date : 22-05-2022 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi
Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా కాలం తరువాత చైనా అంశాన్ని ప్రస్తావించారు. మొన్నామధ్య నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో చైనా రాయబారితో మాటలు కలిపారన్న విమర్శలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ లోలోన చైనాకు ఫేవర్ గా ఉంటూ.. బయటకు మాత్రం చైనాపై ద్వేషం చూపిస్తుంటారని బీజేపీ నేతలు ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా అనే పదం రాహుల్ గాంధీ నోటి నుంచి రాలేదు. ఇన్ని రోజుల తరువాత చైనా ఆక్రమణను ప్రముఖంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ.

లద్దాఖ్ లో మారుతున్న పరిస్థితులపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనాతో ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. రష్యా-ఉక్రెయిన్ కొట్లాడుకుంటున్న రీతిలో ఎల్ఏసీ వద్ద పరిస్థితులు మారాయంటూ పోల్చారు. భారత్ లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చెప్పుకుంటున్న చైనా.. రష్యా చెప్పిన కారణంతోనే కయ్యానికి కాలుదువ్వుతోందని చెప్పుకొచ్చారు. లద్దాఖ్, డోక్లాంలో ఇప్పటికే తిష్ట వేసిన చైనా దళాలు.. రేప్పొద్దున అవి తమవేనంటూ దాడికి దిగినా దిగొచ్చని అన్నారు. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనను ప్రస్తావించారు. ఇంత జరుగుతున్నా సరే బీజేపీ ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయిందని ఆరోపించారు.

చైనా ఆక్రమణ, భారత్ తో ఘర్షణల గురించి ఎవరైనా మాట్లాడితే.. వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. ఇదే సందర్భంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధి ఫలాలు కొందరికే అందాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నామని, తాము మాత్రం అందరికీ సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china row
  • congress
  • rahul gandhi
  • rahul pulls up

Related News

An economic crisis is looming in the country: Rahul Gandhi

Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్త

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM: కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

  • kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

  • CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల

  • Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd