HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rahul Gandhi Back As Mp After Supreme Court Relief

Rahul Gandhi : రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ..

సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది.

  • By Sudheer Published Date - 11:48 AM, Mon - 7 August 23
  • daily-hunt
Rahul
Rahul

కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిరిగి ఎంపీగా కొనసాగనున్నారు. ఆయన పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. ప్రధాని మోడీ ఇంటి పేరు కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చి 23, 2023 న గుజరాత్ కోర్ట్ తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజు మార్చి 24, 2023 న రాహుల్‌ పై అనర్హతవేటు పడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 లోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియేట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రెండేళ్ల జైలు శిక్షను రాహుల్ గాంధీ సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీం కోర్ట్ స్టే విధించింది. సుప్రీం కోర్ట్ (Supreme Court) ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌ పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌ సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

ఇక రాహుల్ (Rahul Gandhi) లోక్‌ సభ సభ్యత్వం పునరుద్ధరణ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద వేడుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు డప్పుల మోతతో డ్యాన్స్ చేస్తూ తమ నాయకుడికి అనుకూలంగా తీర్పు రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆగస్టు 8 నుంచి లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న తరుణంలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని (Rahul MP) పునరుద్ధరిస్తున్నారు. ఆగస్టు 8 నుంచి 10 వరకు పార్లమెంట్‌ లో ఈ చర్చ జరగనుంది. దీనిపై ప్రధాని ఆగస్టు 10న ప్రకటన చేయనున్నారు. మరి ఈ చర్చలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొంటారా లేదా అనేది చూడాలి.

వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన రోజునే కాంగ్రెస్ శ్రేణులు ఆకాశాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. తీర్పు అయితే రాహుల్ గాంధీకి (Rahul Gandhi) అనుకూలంగా వచ్చింది కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఆయన హాజరవుతారా లేదా అనేదానిపై టెన్షన్ లో ఉన్నారు. ఈరోజు (ఆగస్టు 07, 2023) సోమవారం, లోక్‌ సభ కార్యాలయం నుండి స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేయడం.. ఈ నోటిఫికేషన్లో రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలుపడం తో సంతోషం వక్తం చేస్తున్నారు.

Read Also : National Handlooms Day: చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Congress celebrations
  • india
  • parliamentary membership
  • Rahul Gandhi back as MP
  • Rahul MP
  • Supreme Court

Related News

Modi Speech

Viksit Bharat : యూత్ సంకల్పమే ‘వికసిత్ భారత్’ – మోదీ

Viksit Bharat : భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 128వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ యువత మరియు శాస్త్రవేత్తల నిబద్ధతను ఒకే వేదికపై ఉంచి ప్రశంసించారు

  • Mahmood Madani

    Mahmood Madani: జిహాద్ ఎంత‌కాల‌మైనా ఉంటుంది?: జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు

  • Ktr Deekshadiwas

    BRS Diksha Divas : ఈ పదేళ్లు దీక్షా దివస్ గుర్తురాలేదా ..కేటీఆర్? కాంగ్రెస్ సూటి ప్రశ్న

  • India

    India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Commonwealth Games

    Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

Latest News

  • ‎Beauty Tips: అమ్మాయిలు మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!

  • ‎Health Tips: ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన పిండితో.. చపాతీ చేసి తింటున్నారా.. డేంజర్ బెల్ మోగినట్లే!

  • ‎Nick Names: చిన్న పిల్లలను ముద్దుపేర్లతో పిలుస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

  • ‎Lakshmi Devi: అప్పుల బాధలు తిరిపోవాలా.. అయితే లక్ష్మిదేవికి ఈ మూడు వస్తువులు సమర్పించాల్సిందే!

  • Sugar Syrup: తీపి వంటకాల కోసం సరైన పద్ధతిలో పాకం తయారు చేయడం ఎలా?

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd