Radiation Leak : భారత్ దాడితో పాక్‌లో రేడియేషన్ లీక్.. అమెరికా, ఈజిప్ట్ ఏం చేశాయంటే..
దీంతో తొలుత అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం(Radiation Leak) పాకిస్తాన్‌కు చేరుకుందట.
- By Pasha Published Date - 08:41 AM, Thu - 15 May 25

Radiation Leak : ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ అకస్మాత్తుగా ఎందుకు ఆపింది ? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ అణుబాంబులున్న పంజాబ్ ప్రావిన్స్‌లోని కిరానా హిల్స్‌కు సమీపంలో ఉన్న సర్గోడా ఎయిర్ బేస్‌పై భారత మిస్సైళ్లు పడ్డాయట. ఈ మిస్సైళ్ల వల్ల చెలరేగిన మంటలు, సమీపంలోని భూగర్భ సొరంగంలో ఉన్న అణు వార్‌హెడ్లను తాకినట్లు తెలుస్తోంది. దీంతో రేడియేషన్ లీక్ జరిగినట్లు సమాచారం. ఫలితంగా పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో అస్వస్థతకు గురయ్యారట. దీంతో వారందరినీ హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారట. దీంతో ఏం చేయాలో అర్థంకాక.. పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా, ఈజిప్టులను సాయం కోరిందట.
Also Read :IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్‌లదే ఆధిపత్యం !!
తొలుత అమెరికా.. తర్వాత ఈజిప్టు..
దీంతో తొలుత అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం(Radiation Leak) పాకిస్తాన్‌కు చేరుకుందట. అది కిరానాహిల్స్, దాని పరిసర ప్రాంతాల్లో రేడియేషన్ లీక్ ఎంతమేర ఉందనే దానిపై అంచనాలను తయారు చేసింది. వాటి నియంత్రణకు పలు శాస్త్రీయ చర్యలు చేపట్టింది. ఆ వెంటనే బోరాన్ నిల్వలతో ఈజిప్టు నుంచి ఒక విమానం పాకిస్తాన్‌కు చేరిందట. బోరాన్‌తో కిరానా హిల్స్ భూగర్భ సొరంగాల్లో రేడియేషన్ లీక్‌ను కట్టడి చేసే చర్యలను చేపట్టారని సమాచారం. అణుధార్మికతకు సంబంధించిన న్యూట్రాన్లు బోరాన్-10 ఐసోటోప్‌లలో విలీనం అవుతాయి. ఫలితంగా పరిసరాల్లో రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈజిప్టు దేశం బోరాన్‌ను పాకిస్తాన్‌కు పంపిందని తెలిసింది. దీంతోపాటు భారత్ దాడుల్లో పాకిస్తాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో బంకర్లలో ఉన్న వార్‌హెడ్లకు కూడా నష్టం జరిగిందని అంటున్నారు. అక్కడ కూడా రేడియో ధార్మికత లీకై ఉండొచ్చని కథనాలు వస్తున్నాయి.
Also Read :Saraswati Pushkaram : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం.. సాయంత్రం కాళేశ్వరానికి సీఎం రేవంత్
ప్రధాని మోడీకి స్వయంగా వివరించిన ట్రంప్
పాకిస్తాన్‌లో ఏర్పడిన ఈ హైటెన్షన్ పరిస్థితుల గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేసి వివరించారట. దీంతో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు మోడీ అంగీకారం తెలిపారట. ఆ తర్వాతే భారత్, పాకిస్తాన్‌లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) చర్చలు జరుపుకున్నారు. కాల్పుల విరమణపై అంగీకారానికి వచ్చామని అధికారికంగా ప్రకటించారు. భారత మిస్సైళ్ల దాడిలో కిరానా హిల్స్‌లో ఉన్న పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలకు ఎంతేమర నష్టం జరిగింది ? అనే సమాచారం తెలియాల్సి ఉంది. కిరానా హిల్స్ వైశాల్యం 68 చదరపు కిలోమీటర్లు. అయితే ఇందులో 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్తాన్ ఆర్మీ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10కిపైగా సొరంగాలను నిర్మించుకుంది. వాటిలోనే చిన్నపాటి అణుదాడులు చేయగల న్యూక్లియర్ వార్‌హెడ్‌లను దాచుకుంది.