Radhika : లోక్‌సభ ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్
- Author : Latha Suma
Date : 22-03-2024 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
Radhika Sarathkumar : ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections) బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ(bjp) ప్రకటించిన నాలుగో జాబితా(Fourth list)లో నటి రాధిక(Actress Radhika) స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు(Tamil Nadu)లోని విరుధ్‌నగర్(Virudhnagar) నుంచి ఆమె పోటీ చేయనున్నారు. కాగా.. ఇటీవలే రాధిక భర్త పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించి జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన ఆమె హీరోయిన్‌గా నటించి, మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా పలు రియాల్టీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.
కాగా, గతంలో 195 మందితో తొలి జాబితా, ఇటీవల 72 మందితో రెండో జాబితా, 9 మందితో మూడో జాబితాను బిజెపి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 15 మందితో నాలుగో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 291 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.
read also: Sreemukhi: ‘కేరింత’ నటుడి చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి…