Doctors Arrest : ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను మార్చేసిన డాక్టర్లు అరెస్ట్
పూణే కారు ప్రమాదం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు జరిగే కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటికి వస్తున్నాయి.
- By Pasha Published Date - 12:26 PM, Mon - 27 May 24

Doctors Arrest : పూణే కారు ప్రమాదం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు జరిగే కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఓ మైనర్ బాలుడు మద్యం తప్ప తాగి.. ర్యాష్ డ్రైవింగ్ చేసి.. ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో మైనర్ బాలుడి కుటుంబం ఇచ్చిన డబ్బుకు ఇద్దరు డాక్టర్లు అమ్ముడుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పూణే పోలీసులు బాలుడి శరీరం నుంచి బ్లడ్ శాంపిల్‌ను సేకరించి వైద్య పరీక్ష కోసం స్థానికంగా ఉండే ససూన్ ఆస్పత్రికి పంపారు. బాలుడి రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఉంటే అతడు మద్యం తాగినట్టుగా పరిగణిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
కీలకమైన ఈ పరీక్ష నుంచి మైనర్ బాలుడిని రక్షించేందుకు అతడి తల్లిదండ్రులు(విశాల్ అగర్వాల్ దంపతులు) రంగంలోకి దిగారు. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను తారుమారు చేయాలని ససూన్ ఆస్పత్రిలోని డాక్టర్లు అజయ్ తావ్రే, శ్రీహరి హర్నార్‌లను కోరారు. దీనికి డాక్టర్లు కూడా ఓకే చెప్పారు. ఇందుకోసం బాలుడి పేరెంట్స్ నుంచి ఆ డాక్టర్లు డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎంత తీసుకున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. విచారణలో ఈ వివరాలన్నీ బయటపడటంతో డాక్టర్లు డాక్టర్లు(Doctors Arrest) అజయ్ తావ్రే, శ్రీహరి హర్నార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : Mahesh Babu : తండ్రిగా గర్విస్తున్నా.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
ఈ డాక్టర్లు సదరు బాలుడి బ్లడ్ శాంపిల్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి.. దాని ప్లేసులో మరొకరి శాంపిల్‌ను పెట్టారని పోలీసులు వెల్లడించారు. అందువల్లే బాలుడు బార్‌లో కూర్చొని మద్యం తాగినట్టు వీడియో ప్రూఫ్ ఉన్నప్ప టికీ.. అతడి రక్తంలో ఆల్కహాల్ లేదని రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇప్పటికే ఈ కేసులో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని జువెనైల్ హోంకు తరలించారు. ఇక అతడి తండ్రి, తాత పోలీస్ కస్టడీలో ఉన్నారు. పూణేలో డ్రైవింగ్ చేయడానికి ముందు సదరు బాలుడికి మద్యాన్ని విక్రయించిన బార్ సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.