Priyanka Gandhi: దోశలు వేసిన ప్రియాంక గాంధీ
కర్ణాటకలో మే10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోనే తిరుగుతున్నారు
- Author : Praveen Aluthuru
Date : 26-04-2023 - 2:27 IST
Published By : Hashtagu Telugu Desk
Priyanka Gandhi: కర్ణాటకలో మే10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమదైన స్టైల్ లో ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ మైసూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే విరామం తీసుకుని అల్పాహారం కోసం మైసూర్ లోని అత్యంత ప్రసిద్ధగాంచిన మైలారీ రెస్టారెంట్‌కి వెళ్లారు. ప్రియాంక గాంధీ వెంట కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాతో పాటు మరికొంత మంది ఉన్నారు.
ప్రియాంక గాంధీ అల్పాహారం అనంతరం పార్టీ నేతలతో ముచ్చటించారు. కొంత విరామం అనంతరం సదరు హోటల్ లోని కిచెన్ కి వెళ్లి వంట వాళ్ళతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ సరదాగా దోశలు వేశారు. పెనం మీద 6 దోసెలు వేయగా..సకాలంలో దోసెను తిప్పకపోవడంతో రెండు దోశలు మాడిపోయాయి. దీంతో అక్కడ నవ్వుల వాతావరణం నెలకొంది. అనంతరం రెస్టారెంట్ యజమానికి, వర్కర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ వారితో సెల్ఫీ దిగారు. ప్రియాంక గాంధీ దోస చేస్తున్న వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
కర్ణాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. అక్కడ జెండా పాతేందుకు కాంగ్రెస్ అంది వచ్చిన అవకాశాలను వదలట్లేదు. రోడ్ షోలు, బహిరంగ సభలతో తమ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరులో కాంగ్రెస్, బీజేపీ మధ్య వర్గ పోరు నడుస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీపై వేటు పడటం కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నిపుణులు.
Read More: Vishakha RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో దారుణం.. అర్ధనగ్నంగా మహిళ డెడ్ బాడీ!