Union Budget : ఆర్థిక వేత్తలతో ప్రధాని మోడీ భేటి
ఏ రంగంలో ఏ స్థాయిలో సంస్కరణలు అవసరమో ఆయా రంగాల నిపుణుల నుండి అభిప్రాయాలను సేకరించాలని ప్రధాని మోడీ అభిప్రాయపడినట్లు సమాచారం.
- By Latha Suma Published Date - 05:26 PM, Thu - 11 July 24

Parliament Budget: ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ ఆర్థిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణనులతో ప్రధాని మోడీ(PM Modi) గురువారం భేటి అయ్యారు. ఈ సాధారణ బడ్జెట్(General budget)లో పరిశ్రమలతో పాటు మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. వాస్తవానికి, మరింత ఎక్కువ పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని భావిస్తున్నది. గత పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోడీ 3.O ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనుందని చెప్పారు. పెట్టుబడులు రాబట్టడం ద్వారా వృద్ధిరేటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తున్నది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఏ రంగంలో ఏ స్థాయిలో సంస్కరణలు అవసరమో ఆయా రంగాల నిపుణుల నుండి అభిప్రాయాలను సేకరించాలని ప్రధాని మోడీ అభిప్రాయపడినట్లు సమాచారం. 2047 నాటికి మోడీ ప్రభుత్వం భారత్(India)ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సాధారణ బడ్జెట్ ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని.. ఇందుకోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల రంగంలో ప్రత్యేక కృషి అవసరమని భావించారు.
Read Also: Bhole Baba : భోలే బాబా లీలలు.. కన్యపిల్లలతో స్నానాలు..కన్యలతోనే భోజనాలు
ఇకపోతే, ఈ భేటీలో అభివృద్ధి చెందిన భారతదేశానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై నిపుణుల నుంచి ప్రధాని సూచనలు కూడా తీసుకోనున్నారు. ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సైతం పేద, మధ్య దిగువ మధ్యతరగతి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఆదాయపు పన్ను, గృహ రుణాల విషయంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతులకు అందించాల్సిన ఉపశమనంపై సైతం నిపుణుల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సైతం హాజరయ్యారు.
Read Also: HIV : దేశంలోని ఈ రాష్ట్రాల్లో హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ చాలా రెట్లు పెరిగాయి.. కారణం ఏమిటి..?