Prices Will Drop : భారీగా తగ్గబోతున్న ఫ్రిజ్, ఏసీ, టీవీల ధరలు
Prices Will Drop : ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించడం. ప్రస్తుతం ఉన్న 12% మరియు 28% జీఎస్టీ శ్లాబ్‌లను రద్దు
- By Sudheer Published Date - 07:31 PM, Sat - 16 August 25

ప్రధాని మోడీ.. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ దీపావళికి ప్రజలకు ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రాలతో చర్చలు పూర్తయ్యాయని, దీపావళి నాటికి కొత్త జీఎస్టీ (GST) సంస్కరణలను అమలు చేయనున్నామని తెలిపారు. ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించడం. ప్రస్తుతం ఉన్న 12% మరియు 28% జీఎస్టీ శ్లాబ్‌లను రద్దు చేసి, వాటి స్థానంలో కేవలం 5% మరియు 18% శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల దాదాపు 90% వస్తువులపై పన్నులు తగ్గి, అవి చౌకగా లభించనున్నాయి.
Calcium Deficiency: మహిళల్లో కాల్షియం లోపం.. లక్షణాలు, నివారణ మార్గాలీవే!
కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే.. ప్రజలకు ఎంతో లాభం చేకూరనుంది. ముఖ్యంగా ప్రస్తుతం 12% పన్ను పరిధిలో ఉన్న స్నాక్స్, డ్రైఫ్రూట్స్, రూ. 500 లోపు చెప్పులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, చార్జర్లు, ప్యాక్ చేసిన ఆయుర్వేద మందులు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి వస్తువులు 5% శ్లాబ్‌లోకి రానున్నాయి. దీనివల్ల వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% పన్ను పరిధిలో ఉన్న 90% వస్తువులను 18% శ్లాబ్‌లోకి మార్చనున్నారు. దీని వల్ల బిస్కెట్లు, నూడుల్స్, గృహోపకరణాలైన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, అలాగే దుస్తులు, పాదరక్షలు, సౌందర్య సాధనాల ధరలు కూడా తగ్గుతాయి. అయితే పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉంది.
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
ఈ జీఎస్టీ సంస్కరణలు కేవలం వినియోగదారులకు మాత్రమే కాకుండా, వ్యాపార రంగానికి కూడా మేలు చేయనున్నాయి. టెక్స్‌టైల్, ఆటోమొబైల్, హస్తకళలు, వ్యవసాయం వంటి అనేక రంగాలకు ఈ కొత్త పన్ను విధానం ఊతమిస్తుంది. వస్తువుల ధరలు తగ్గడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపిరి పోస్తుంది.