పాక్ కూల్చిన ‘కాళీ’ ఆలయం పునరుద్ధరణ
పాకిస్తాన్ ధ్వంసం చేసిన చారిత్రక కాళీ ఆలయాన్ని 50 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఆ ఆలయాన్ని రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం తిరిగి ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈ కాళీ ఆలయం ఉంది. పాకిస్తానీ బలగాలు 1971లో ఈ ఆలయానికి నిప్పు అంటించాయి.
- By CS Rao Published Date - 03:57 PM, Fri - 17 December 21

పాకిస్తాన్ ధ్వంసం చేసిన చారిత్రక కాళీ ఆలయాన్ని 50 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఆ ఆలయాన్ని రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం తిరిగి ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈ కాళీ ఆలయం ఉంది. పాకిస్తానీ బలగాలు 1971లో ఈ ఆలయానికి నిప్పు అంటించాయి. ఆ క్రమంలో ఆలయంలోని ఆనేక మంది భక్తులు మరణించారు. కాళీ ఆలయాన్ని పునరుద్ధరించడానికి బంగ్లాదేశ్ కు భారత్ అండగా నిలిచింది.బంగ్లాదేశ్‌లో ప్రతిఘటన ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్స పేరుతో పాకిస్థానీ సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేసింది. ఆనాటి నుంచి ఆలయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్మించలేకపోయింది. ఇటీవల భారత్ మద్ధతుతో ఆలయాన్ని వేగంగా పునరుద్ధరించింది.
1971 లిబరేషన్ వార్‌లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వాటికి హాజరు కావడానికి రాష్ట్రపతి కోవింద్ అక్కడికి వెళ్లారు. ఎం అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్‌లో పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా రాష్ట్రపతి మరియు ప్రథమ మహిళ సవితా కోవింద్ పునరుద్ధరించిన ఆలయంలో ప్రార్థనలు చేశారు.