HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Postponement Of Civils Preliminary Exam

Cyclone Dana: వాయిదా పడిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

Cyclone Dana: మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేస్తామని పేర్కొంది. సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడానికి 2023లో నోటిఫికేషన్‌ జారీ అయింది.

  • Author : Latha Suma Date : 23-10-2024 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Postponement of Civils Preliminary Exam
Postponement of Civils Preliminary Exam

UPSC Civil Services Prelims 2024 : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీని ప్రభావం ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉండబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర సహా ఈ మూడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 520, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 610, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు ఆగ్నేయ దిశగా 610 కిలో మీటర్ల దూరంలో ఉంది.

అయితే తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరో ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసుల పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేస్తామని పేర్కొంది. సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడానికి 2023లో నోటిఫికేషన్‌ జారీ అయింది. అప్పట్లో ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. తుఫాన్‌ సంభవించనున్నందున దీన్ని వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. బాలాసోర్ సమీపంలో గల ధర్మా పోర్ట్ వద్ద తీరాన్ని తాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. గంజాం, పూరీ, జగత్‌సింగ్ పూర్, కేంద్రాపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, కియొంఝర్, ఢెంకనాల్, జైపూర్, అంగుల్, ఖుర్దా, నయాగఢ్, కటక్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించింది ప్రభుత్వం. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు సెలవు ఉంటుంది.

Read Also: Chhota Rajan : ఛోటా రాజన్‌కు బెయిల్.. జీవితఖైదు శిక్ష రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cyclone Dana
  • odisha
  • Odisha Government
  • Postponement exam
  • UPSC Civil Services Prelims 2024
  • West Bengal

Related News

Venu Swamy Prediction on Vijay

Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న

  • West Bengal BJP CM Suvendu Adhikari

    Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • CM Chandrababu

    బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

Latest News

  • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd