Narendra Modi: కేదార్ నాథ్ లో మోడీ పూజలు.. ఆకట్టుకున్న హిమాచలీ దుస్తులు!
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు.
- By Balu J Published Date - 02:35 PM, Fri - 21 October 22

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఆయన ప్రార్థనలు చేసి, చంబా మహిళ తనకు బహుమతిగా ఇచ్చిన సంప్రదాయ హిమాచలీ దుస్తులను ధరించారు. ప్రధానమంత్రి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా ఈ దుస్తులను బహుమతిగా ఇచ్చారు. ఒక ప్రత్యేక సందర్భంలో ధరిస్తానని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి కేదార్‌నాథ్ రోప్‌వేను ప్రారంభించిన తర్వాత ఆలయ ప్రాంగణం మొత్తం శివుని భక్తిగీతాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రేమ్ చంద్ర అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. 3 వేల 4 వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం.. కొత్త రోప్ వే ప్రాజెక్టులను చేపడుతుంది. అలాగే అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. అన్ని చోట్లా భద్రతా సిబ్బంది మోహరించారు.
♦ఉత్తరాఖండ్ : ఆదిగురు శంకరాచార్యుల సమాధి స్థల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
♦9.7 కిలోమీటర్ల పొడవైన గౌరీకుంద్-కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
♦అక్కడ కూలీలతో ముచ్చటించారు.#Uttarakhand #Kedarnath pic.twitter.com/TcpadWosiA— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 21, 2022