Pawan Kalyan : ప్రధాని మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతం : పవన్ కళ్యాణ్
PM Modi political rise is a miracle: 'అతి సామాన్యమైన ఫ్యామిలీలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 01:18 PM, Tue - 17 September 24

PM Modi political rise is a miracle: ప్రధాని మోడీ మంగళవారం 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యామాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘అతి సామాన్యమైన ఫ్యామిలీలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: US Vs Russia : అమెరికా సముద్ర జలాల్లోకి రష్యా జలాంతర్గాములు.. ఏమైందంటే ?
ఈ మేరకు ఎక్స్‌లో ఆయన మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ శక్తి సామర్ధ్యాలకు, భారతీయతలోని గొప్పదనానికీ అంతర్జాతీయ యవనికపై మరింత ప్రాచుర్యం కలిగించిన వారిలో మోడీ అగ్రగణ్యులని కొనియాడారు.
భారతదేశాన్ని ప్రపంచంలో ప్రభల ఆర్ధిక శక్తిగా రూపొందించే సంకల్పంతో ఆయన వడివడిగా వేస్తున్న అడుగులు బహు ప్రశంసనీయం. వరుసగా పుష్కర కాలానికిపైగా గుజరాత్ రాష్ట్ర సీఎంగా, వరుసగా మరో 3 పర్యాయాలు అఖండ భారతావనికి ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం ‘న భూతో న భవిష్యతి’.అటువంటి గొప్ప రాజకీయ మానవతావాది నాయకత్వంలోని ఎన్డీయేలో తాను సైతం భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.