HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modis Pakistani Sister Prepares Handmade Rakhi

Rakhi : 30 ఏళ్లుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్న పాకిస్థాన్ ముస్లిం మహిళ !!

Rakhi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)కి ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు రాఖీలు కడుతూ ఉంటారు. కానీ ఒక ముస్లిం మహిళ మాత్రం గత 30 సంవత్సరాలుగా ఆయనకు రాఖీ కడుతూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు

  • Author : Sudheer Date : 08-08-2025 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Qamar Mohsin Sheikh Modi
Qamar Mohsin Sheikh Modi

రాఖీ (Rakhi ) పండుగ అంటే అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. ఈ రోజున తోడబుట్టిన వారికి మాత్రమే కాకుండా, సోదరభావంతో మెలిగే వారికి కూడా రాఖీ కట్టడం ఆనవాయితీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)కి ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు రాఖీలు కడుతూ ఉంటారు. కానీ ఒక ముస్లిం మహిళ మాత్రం గత 30 సంవత్సరాలుగా ఆయనకు రాఖీ కడుతూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు. ఆమే పాకిస్థాన్‌లో పుట్టి, భారతదేశంలో స్థిరపడిన ఖమర్ మొహ్సిన్ షేక్.

Kantara Chapter1 : కాంతారా.. చాప్టర్ 1′ నుంచి రుక్మిణి వసంత్ ఫస్ట్‌లుక్

ఈ ఏడాది రాఖీ పండుగ కోసం ఖమర్ మొహ్సిన్ షేక్ (Qamar Mohsin Sheikh) ప్రత్యేకంగా ‘ఓం’ గుర్తుతో ఉన్న రాఖీని తయారు చేశారు. ఇది సంప్రదాయానికి, భక్తికి నిదర్శనమని ఆమె తెలిపారు. గత 30 ఏళ్లుగా ఆమె స్వయంగా రాఖీలు తయారు చేసి, వాటిలో ఒకటి మోదీకి కడుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి కావాలనీ, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి కావాలనీ కోరిన ఆమె కోరికలు నెరవేరాయి. ఇప్పుడు ప్రపంచాన్ని పాలించాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. మన దేశం సాధిస్తున్న విజయాలకు మోదీ కృషి కారణమని ఆమె ప్రశంసించారు.

Kohli New Look : తెల్లగడ్డం తో కోహ్లీ న్యూ లుక్

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు, ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే ఖమర్ మొహ్సిన్ షేక్ ఆయనకు రాఖీ కడుతున్నారు. ఆ సమయంలో “సోదరీ.. ఎలా ఉన్నారు?” అని మోదీ పలకరించడంతో వారి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం మొదలైందని ఆమె గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో తప్ప, ఆమె ప్రతి సంవత్సరం మోదీకి రాఖీ కడుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా స్వయంగా రాఖీ కట్టాలని, అందుకోసం ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపారు. తాను ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ, ఈ బంధాన్ని కొనసాగించడం తనకు గర్వంగా ఉందని మొహ్సిన్ షేక్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • modi
  • Pak-Origin Woman To Tie Handmade Rakhi To PM Modi
  • PM Modi's Pakistani ‘rakhi sister
  • Qamar Mohsin Sheikh
  • Rakhi

Related News

Jewar Airport

Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

ఈ ప్రాజెక్టుతో ప్రధానికి ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా చర్చకు వచ్చింది. తనను ఎంపీగా ఎన్నుకున్న రాష్ట్రం కావడంతో యూపీ పురోగతి పట్ల ఆయన గర్వాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, హర్యానాలోని ఫరీదాబాద్ వంటి

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Pm Kisan

    PM Kisan Yojana: పీఎం కిసాన్ రైతులకు గొప్ప శుభవార్త

  • PM Modi

    Modi : మోడీ ని ఫిదా చేసిన విజయవాడ సింగర్

Latest News

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

  • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

  • Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd