Kohli New Look : తెల్లగడ్డం తో కోహ్లీ న్యూ లుక్
Kohli New Look : ఐపీఎల్ 2025 తర్వాత పెద్దగా బయట కనిపించని కోహ్లీ, ఇప్పుడు తెల్ల గడ్డంతో ఉన్న ఫొటోలో కనిపించాడు
- By Sudheer Published Date - 02:03 PM, Fri - 8 August 25

క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ(Kohli )కి సంబంధించిన కొత్త ఫొటోలు షాక్ ఇస్తున్నాయి ఈ మధ్య ఐపీఎల్ 2025 తర్వాత పెద్దగా బయట కనిపించని కోహ్లీ, ఇప్పుడు తెల్ల గడ్డంతో ఉన్న ఫొటోలో కనిపించాడు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. టీమిండియాకు ప్రస్తుతం వన్డే సిరీస్‌లు లేకపోవడంతో, కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ కర్ణాటక న్యాయవాది శశి కిరణ్ శెట్టితో ఉన్న కోహ్లీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కోహ్లీ వయసు పైబడిన వాడిలా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు, ఇది మన కోహ్లీనేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
S ** Consent : లైంగిక సమ్మతికి ఏజ్ ను ఫిక్స్ చేసిన కేంద్రం
ఈ ఫొటో బయటకు వచ్చిన తర్వాత, కోహ్లీ వన్డే భవిష్యత్తు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్ 2027 వరకు కోహ్లీ వన్డేలు ఆడతాడని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఈ కొత్త ఫొటో చూసిన తర్వాత నెటిజన్లు “కోహ్లీ ఇంకో రెండేళ్లు ఆడగలడా?” అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోహ్లీ వన్డే రిటైర్మెంట్ గురించి కూడా చర్చ మొదలైంది. అయితే మరికొందరు అభిమానులు దీనిని పెద్ద విషయం కాదని, తెల్ల గడ్డం చాలా మందికి ఉంటుందని, కోహ్లీ ఫిట్‌నెస్ ఇంకా యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోదని బలంగా చెబుతున్నారు.
కోహ్లీతో ఫొటోలో ఉన్న న్యాయవాది శశి కిరణ్ శెట్టి గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ 2025 తర్వాత బెంగళూరులో జరిగిన విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఆర్సీబీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆర్సీబీ తరఫున శశి కిరణ్ శెట్టి వాదిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు గురించి మాట్లాడేందుకే ఆయన కోహ్లీతో కలిసి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫొటోతో పాటు కోహ్లీ భవిష్యత్తు గురించి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
Jogi Ramesh : జోగి రమేశ్ కు బిగుస్తున్న ఉచ్చు!