HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi To Inaugurate 38th National Games

National Games 2025 : 38వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని

ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

  • Author : Latha Suma Date : 28-01-2025 - 1:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central Taxes
Central Taxes

National Games 2025 : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు నుండి 38వ జాతీయ క్రీడలు మొదలుకానున్నాయి. కాసేపట్లో ప్రధాని మోడీ వీటిని ప్రారంభించనున్నారు. ఈ క్రీడలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని 11 నగరాల్లో జరుగుతాయి. 36 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఈ జాతీయ క్రీడలలో పాల్గొనబోతున్నాయి. 17 రోజుల పాటు, 35 క్రీడా విభాగాలకు ఈ పోటీలు జరుగుతాయి. వీటిలో 33 క్రీడలకు పతకాలు ప్రదానం చేస్తారు.

ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 16,000 మందికి పైగా ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులతో కూడిన జట్లు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నాయి. యోగా, మల్లఖంబ్‌లను మొదటిసారిగా ఈ జాతీయ క్రీడలలో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకం కావడంతో స్థానికంగా ప్రజలతోపాటు అనేక మంది ఈ క్రీడల గురించి ఆసక్తితో ఉన్నారు.

జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి సహకారాన్ని అందుకుంది. ఈ క్రీడలలో జాతీయ స్థాయిలో ప్రదర్శన ఉన్న 9,000 మంది ప్లేయర్లు తమ ప్రతిభను చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో అన్ని మైదానాలు.. అథ్లెటిక్స్, క్రికెట్ తదితర క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అదేవిధంగా, ప్రభుత్వం 1500 మంది వాలంటీర్లను రంగంలోకి దించి ఈ క్రీడలు సజావుగా జరిగేందుకు కృషిచేస్తుంది. రాష్ట్రం బాగా ఎదుగుతున్న నేపథ్యంలో జాతీయ క్రీడల ద్వారా ప్రపంచానికి ఈ ప్రాంతం మరింత గుర్తింపు సంపాదించడానికి ఈ క్రీడలు మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Read Also: Ropeways: మోదీ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో రోప్‌వేలకు సన్నాహాలు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dehradun
  • Indian Olympic Association President PT Usha
  • National Games 2025
  • pm modi
  • uttarakhand

Related News

Donald Trump

మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Pm Modi Inaugurates Bridge

    Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై ఆరు లేన్ల బ్రిడ్జ్.. ఇంజినీరింగ్ మేధస్సు కు జై కొట్టాల్సిందే !!

  • PM Modi

    బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

  • PM Tariq Rahman

    తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

  • PM Tariq Rahman

    బంగ్లాదేశ్‌లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd