HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi Inaugurated The New Indian Consulate In France

India Consulate : ఫ్రాన్స్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్‌లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది.

  • Author : Latha Suma Date : 12-02-2025 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi inaugurated the new Indian Consulate in France
PM Modi inaugurated the new Indian Consulate in France

India Consulate : ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా, భారతదేశం-ఫ్రాన్స్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది. సాంకేతికత, రక్షణ, పౌర అణుఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

Read Also: Anti Sikh Riots : సిక్కుల ఊచకోత కేసు..దోషిగా మాజీ ఎంపీ

ఈ కార్యక్రమానికి ముందు, ప్రధాని మోడీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్‌లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. దీనిని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ (CWGC) నిర్వహిస్తోంది. ఇక, ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా, మోడీ పారిస్‌లో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ (AI సమ్మిట్) సమావేశంలో సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వివిధ దేశాధినేతలు, టెక్నాలజీ నిపుణుల సమక్షంలో ప్రసంగించారు.

ఇకపోతే..ఈరోజుతో ఫ్రాన్స్‌ పర్యటనను ముగించుకొని ప్రధాని మోడీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అవుతారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోడీ.. పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు,వ్యాపార విధానాలు,ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌ల వంటి కీలక అంశాలపై వారు చర్చించే అవకాశముంది.

Read Also: New Income Tax Bill: రేపు లోక్‌సభ ఎదుటకు నూతన ఐటీ బిల్లు.. దానిలో ఏముంది ?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • French President Emmanuel Macron
  • India Consulate
  • pm modi
  • PMO
  • US-France tour

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Trump- PM Modi

    యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

  • PM Modi

    పశ్చిమ ఆసియాలో యుద్ధం.. ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!

Latest News

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd