PM Modi : జపాన్‌లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
- By Latha Suma Published Date - 10:59 AM, Sat - 30 August 25

PM Modi : జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి శనివారం బుల్లెట్ ట్రైన్ (షింకన్‌సెన్) లో ప్రయాణించి, ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఇద్దరు నేతలు టోక్యో నుంచి ప్రఖ్యాత సెండాయ్ నగరానికి బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మోడీ ప్రయాణ ఫొటోలను తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో షేర్ చేశారు. సెండాయ్ చేరుకున్న మోడీకి అక్కడి ప్రవాస భారతీయులు, స్థానిక జపనీయులు “మోడీ-సాన్, స్వాగతం” అంటూ హర్షధ్వానాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని పట్ల జపనీయుల ఉత్సాహం, ఆదరణ దేశాల మధ్య స్నేహబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
Read Also: Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కీలక మలుపు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్-జపాన్ స్నేహానికి మౌలికంగా నిలిచే అంశాల్లో రాష్ట్రాలు మరియు ప్రిఫెక్చర్ల మధ్య సహకారం కీలకం. కేవలం కేంద్ర ప్రభుత్వాల స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రాంతీయ పరస్పర సంబంధాలు రెండు దేశాలకు స్థిరమైన మద్దతునిస్తాయి అని పేర్కొన్నారు. ఈ దృష్టితోనే రాష్ట్ర-ప్రిఫెక్చర్ భాగస్వామ్య కార్యక్రమం అనే కొత్త శిఖర సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ భాగస్వామ్యంతో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు జపాన్ ప్రిఫెక్చర్లు నేరుగా కలిసి పనిచేసే అవకాశం ఏర్పడనుంది.
ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (SMEs) వంటి రంగాల్లో ఈ సంయుక్త పథకం మేల్కొల్పే అవకాశాల్ని తెరతీయనుంది. ప్రధానంగా స్టార్టప్ రంగం, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆటోమేషన్ వంటి ఆధునిక రంగాల్లో ఈ ప్రాంతీయ భాగస్వామ్యం రెండుదేశాలకు ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలచే శక్తి కలిగి ఉందని మోడీ నొక్కిచెప్పారు. ఇంకా, ఈ పర్యటన సందర్భంగా భారత్ మరియు జపాన్ కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ 2.0. ఈ ఒప్పందాల ద్వారా రెండు దేశాల మధ్య డిజిటల్ పరిజ్ఞాన మార్పిడి, టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధన-పరిశీలనల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇలాంటి శిఖర సదస్సులు, ఆర్థిక, సాంకేతిక, మానవ వనరుల పరస్పర వినియోగానికి దారితీసేలా ఉండటంతోపాటు, ప్రాంతీయ స్థాయిలో అనేక విధాలుగా వ్యాపార, పెట్టుబడి అవకాశాల్ని కూడా సృష్టించనున్నాయి. మొత్తానికి, మోడీ జపాన్ పర్యటన కేవలం సాంబ్రామంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకమైన భాగస్వామ్యానికి బీజం వేసినదిగా అభివర్ణించవచ్చు.
Japan PM Shigeru Ishiba tweets, "With Prime Minister Modi to Sendai…" pic.twitter.com/k9xljgOeV5
— ANI (@ANI) August 30, 2025
Read Also: AP : లేడీ డాన్ అరుణపై పోలీసుల విచారణ..రౌడీషీటర్లు, రాజకీయ నాయకులతో సంబంధాలపై ఆరా!